Begin typing your search above and press return to search.
ట్రైలర్ టాక్: 'ఎ జెంటిల్ మ్యాన్' వచ్చేశాడు
By: Tupaki Desk | 10 July 2017 8:49 PM ISTజెంటిల్ మ్యాన్ టైటిల్ కి మన దగ్గర మంచి డిమాండే ఉంది. ఈ టైటిల్ పై వచ్చిన రెండు సినిమాలు హిట్ కాగా.. ఇప్పుడు ఏ జెంటిల్ మ్యాన్ అంటూ సిద్ధార్ధ మల్హోత్రా వచ్చేస్తున్నాడు. జాక్వెలిన్ ఫెర్నాండెజ్ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రానికి ఇప్పుడు ట్రైలర్ రిలీజ్ చేశారు.
ట్రైలర్ ప్రారంభంలోనే సిద్ధార్ధ మల్హోత్రాను.. గౌరవ్-రిషి పాత్రల్లో పరిచయం చేసేశారు. గౌరవ్ ఎంతో గౌరవంగా ఉండే వ్యక్తి. మంచివాడు.. అందగాడు.. అన్ని సద్గుణాలు ఉంటాయి. కానీ అతనికి లైఫ్ మాత్రం రివర్స్ లో ఉంటుంది. ఇతని లక్ష్యం ఒకటే. తన ప్రియురాలు జాక్వెలిన్ తో యస్ అనిపించుకోవడమే. జాక్వెలిన్ కి ఈ మంచితనమే నచ్చదు. ఇక రిషి పాత్ర కంప్లీట్ రివర్స్. ఇలాంటి గుణాలు గౌరవ్ లో కోరుకుంటుంది జాక్వెలిన్. ఇక విలన్ పాత్రలో సునీల్ శెట్టి దర్శనం ఇస్తాడు. చాలా రోజుల తర్వాత సునీల్ శెట్టిని యాక్షన్ ఎపిసోడ్ లో చూసే అవకాశం ప్రేక్షకులకు బోనస్ అని చెప్పుకోవచ్చు.
సిద్ధార్ధ మల్హోత్రా చూపించే కండలు.. జాక్వెలిన్ ఫెర్నాండెజ్ చూపించే అందాలు సినిమాకు కీలకంగా చెప్పాలి. అయితే.. ఇంతకీ సిద్ధార్ధ మల్హోత్రా నిజంగానే రెండు పాత్రలు చేస్తున్నాడా.. లేక రెండు కలిపి ఒకటే రోల్ గా స్క్రీన్ ప్లే ఉంటుందా అనేదే ఆకట్టుకునే పాయింట్. మొత్తానికి ఎ జెంటిల్ మ్యాన్ పై ట్రైలర్ ద్వారా ఆసక్తి కలిగించడంలో యూనిట్ సక్సెస్ అయిందనే చెప్పాలి.