Begin typing your search above and press return to search.

క్వారంటైన్ వేళ బాయ్ ఫ్రెండ్ తో ఉంటే బాగుంటుందట!

By:  Tupaki Desk   |   24 March 2020 6:10 AM GMT
క్వారంటైన్ వేళ బాయ్ ఫ్రెండ్ తో ఉంటే బాగుంటుందట!
X
పుర్రెకో బుద్ధి, జిహ్వ‌కో రుచి .. అని మన పెద్దోళ్లు ఊరికే అనలేదు. కరోనాతో ప్రాణాలు పోయే ప్రమాదం పొంచి ఉన్న వేళ.. ఊహించని విధంగా వ్యాఖ్యలు చేసి ప్రపంచ వ్యాప్తంగా అందరూ తన వైపు చూసేలా చేసింది గినీ బౌచర్డ్. టెన్నిస్ ను ఫాలో అయ్యే వారికి ఆమె సుపరిచితురాలే. ఆటలు లాంటి మా జీవితంలో ఉండవన్న వారికి మాత్రం ఆమె ఎవరో కూడా తెలీదు. కెనడాకు చెందిన ఈ ప్రముఖ టెన్నిస్ తారా ఆట కంటే కూడా తన అందంతో అందరిని ఫ్లాట్ చేసి పారేస్తుంది.

టెన్నిస్ లాంటి గ్లామరస్ ఆటలో.. అందానికి అందం ఉండి.. దానికి హాట్ ఫోజుల్ని జత చేస్తే వచ్చే ఇమేజ్.. మైలేజీ ఎంతన్న విషయం గినీ బౌచర్డ్ కు తెలిసినంత బాగా మరెవరికీ తెలీదనే చెప్పాలి. అప్పుడెప్పుడో ఆరేళ్ల క్రితం అంటే.. 2014లో వింబుల్డన్ రన్నరప్ గా నిలిచిన ఆమె.. ఆ తర్వాత ఆస్థాయిలో తన ఆటను ప్రదర్శించలేదని చెబుతారు. కానీ.. హాట్ ఫోజులతో ఆమె పోస్టు చేసే ఫోటోలు మాత్రం అదిరిపోతుంటాయని చెబుతారు.

బడ్జెట్ భారీగా పెరిగిపోతుందని మన టాలీవుడ్ దర్శకులు ఆమెను సంప్రదించి ఉండరు కానీ.. తెలుగు సినిమాల్లో ఆమెకు అవకాశం ఇవ్వటానికి అవసరమైన అన్ని క్వాలిటీస్ గినీలో ఉంటాయని చెప్పక తప్పదు. ఇంతకీ ఈ బ్యూటీ ప్రస్తావన కరోనా వేళ ఎందుకు వచ్చిందంటే.. దానికోకారణం లేకపోలేదు. ఇటీవల ఈ అమ్మడు కరోనా నేపథ్యంలో సెల్ప్ క్వారంటైన్ లోఉన్నారు. స్వీయ నిర్భందంలో ఉన్న ఆమెకు బోర్ కొట్టినట్లుంది. వెంటనే ట్విట్టర్ తో తన అభిమానులతో చాట్ చేసేశారు. ఈ సందర్భంగా క్వారంటైన్ టాపిక్ వచ్చింది.

దీనికి బదులుగా ఆమె స్పందిస్తూ.. ఎవరినీ ఉద్దేశించి కాదు కానీ.. క్వారంటైన్ లో ఉన్న వేళ బాయ్ ఫ్రెండ్ వెంట ఉంటే మరింత బాగుంటుందని పేర్కొంది. అమ్మడి రసికతనానికి నెటిజన్లు ఫిదా అయిపోయారు. అమ్మడికి ఇప్పటివరకూ బాయ్ ఫ్రెండ్ లేరన్న విషయాన్ని గుర్తించిన వారు.. పెద్ద ఎత్తున తమ డేటింగ్ ప్రొఫైళ్లను అమ్మడికి పోస్టు చేశారట. ట్విట్టర్ లో తాను చేసిన వ్యాఖ్యకు స్పందనగా భారీగా వచ్చి పడుతున్నడేటింగ్ ప్రొఫైళ్ల విషయాన్ని ప్రస్తావించిన ఆమె.. తనకు అలాంటి వాటి అవసరం లేదన్నారట. ప్రాణాలు తీసే కరోనా ప్రమాదం ముంచుకొస్తున్న వేళ.. ఒళ్లు దగ్గర పెట్టుకొని ఉండాలన్న జాగ్రత్తల కంటే.. బాయ్ ఫ్రెండ్ ఉంటే బాగుంటుందన్న మాటతో నెటిజన్లలో విరహాన్ని పెంచేశారని చెప్పాలి. అయితే.. ఇలాంటివి ఇప్పుడు అవసరమా? అన్నది అసలు ప్రశ్న.