Begin typing your search above and press return to search.

హిందీ అర్జున్‌ రెడ్డి సెట్స్‌ లో విషాదం

By:  Tupaki Desk   |   25 Jan 2019 3:44 PM IST
హిందీ అర్జున్‌ రెడ్డి సెట్స్‌ లో విషాదం
X
తెలుగులో విజయ్‌ దేవరకొండ హీరోగా, షాలిని పాండే హీరోయిన్‌ గా తెరకెక్కి, విడుదలైన 'అర్జున్‌ రెడ్డి' చిత్రం సంచలన విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెల్సిందే. ఆ చిత్రాన్ని ప్రస్తుతం హిందీలో 'కబీర్‌ సింగ్‌' అనే టైటిల్‌ తో రీమేక్‌ చేస్తున్నారు. తెలుగు వర్షన్‌ కు దర్శకత్వం వహించిన సందీప్‌ వంగ హిందీ 'కబీర్‌ సింగ్‌'ను తెరకెక్కిస్తున్నాడు. షాహిద్‌ కపూర్‌ హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో కైరా అద్వానీ హీరోయిన్‌ గా నటిస్తున్న విషయం తెల్సిందే.

షూటింగ్‌ శరవేగంగా జరుగుతున్న ఈ చిత్రం ఈమద్య కాలంలో తెగ వార్తల్లో నిలుస్తూ వచ్చింది. తాజాగా ఈ చిత్ర షూటింగ్‌ సందర్బంగా జనరేటర్‌ ఆపరేటర్‌ రామ్‌ కుమార్‌ ప్రమాదవశాత్తు మరణించాడు. దాంతో మరోసారి ఈ చిత్రం వార్తల్లో నిలిచింది. ముస్సోరిలోని ఒక హోటల్‌ లో చిత్రీకరణ జరుపుతున్న సమయంలో రామ్‌ కుమార్‌ తలకు ఫ్యాన్‌ తలగడంతో తీవ్ర గాయం అయ్యిందట. దాంతో వెంటనే అతడిని హాస్పిటల్‌ కు తరలించి చికిత్స అందించే ప్రయత్నం చేశారు.

తీవ్ర గాయమయిన రామ్‌ కుమార్‌ చికిత్స పొందుతు మృతి చెందాడట. కేసు నమోదు చేసిన పోలీసులు రామ్‌ కుమార్‌ మృతదేహానికి పంచనామా నిర్వహించి బాడీని అప్పగించారు. ప్రమాద కారణంగా షూటింగ్‌ కు ఒక్క రోజు గ్యాప్‌ ఇచ్చారు. రామ్‌ కుమార్‌ మరణంతో చిత్ర యూనిట్‌ సభ్యులంతా కూడా విషాదంలో మునిగి పోయింది. ఉత్తర ప్రదేశ్‌ లోని ముజాఫర్‌ నగర్‌ నుండి ముంబయికి రామ్‌ కుమార్‌ వచ్చినట్లుగా తెలుస్తోంది.