Begin typing your search above and press return to search.

ట్విట్టర్ వేదికగా హీరో హీరోయిన్ల 'ఢీ'...!

By:  Tupaki Desk   |   14 April 2020 7:00 PM IST
ట్విట్టర్ వేదికగా హీరో హీరోయిన్ల ఢీ...!
X
సినీ ఇండస్ట్రీలో కెరీర్ ప్రారంభించిన ప్రతి హీరోకి తన కెరీర్ లో గుర్తిండిపోయే సినిమా ఒకటి తప్పకుండా ఉంటుంది. మరీ ముఖ్యంగా తన కెరీర్ ని ఓ రేంజ్ కి తీసుకెళ్లిన సినిమా ఉంటుంది. మంచు విష్ణు కెరీర్లో అలాంటి చిత్రమే 'ఢీ'. మంచు విష్ణు, జెనీలియా జంటగా శ్రీను వైట్ల దర్శకత్వంలో రూపొందిన 'ఢీ' మూవీ విడుదలై 13 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఈ సందర్బంగా 'ఢీ' సినిమా జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ హీరో విష్ణు - డైరెక్టర్ శ్రీను వైట్ల ట్వీట్ చేశారు. క్వారంటైన్ సమయంలో తమ సినిమా జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ ఎంజాయ్ చేస్తున్న క్రమంలోనే తాజాగా యంగ్ హీరో మంచు విష్ణు, హీరోయిన్ జెనీలియా - డైరెక్టర్ శ్రీనువైట్ల మధ్య సరదా సంభాషణ చోటుచేసుకుంది.

విష్ణు ట్వీట్ చేస్తూ.. 'ఢీ' చిత్రం విడుదలై 13 ఏళ్ళు గడిచింది. 2007 ఏప్రిల్ 13న ఈ చిత్రం విడుదలయింది. ఈ చిత్రం విడుదలైనప్పుడు మా టీమ్ అందరి కళ్ళలో ఆనంద బాష్పాలు చూశాను. మా నాన్న మోహన్ బాబు గారు లేకుంటే ఈ చిత్రం ఎప్పటికీ విడుదలై ఉండేది కాదు. ఇది కల్ట్ యాక్షన్ కామెడీ చిత్రం. ఈ చిత్రానికి అన్నీ నా పెద్దన్నయ్య శ్రీను వైట్లనే. 'ఢీ 2' ఎప్పుడు అంటూ విష్ణు శ్రీనువైట్లని ప్రశ్నించాడు. ఈ ట్వీట్ చూసిన జెనీలియా 'నేను కూడా అక్కడ ఉన్నట్టు నీకు గుర్తుందా' అని ప్రశ్నించింది. ఆమె ప్రశ్నకు బదులిచ్చిన మంచు విష్ణు.. 'ఈ ఫొటో చూశావా? నువ్వు చాలా అందంగా ఉన్నావు. అప్పుడు ఇప్పుడు ఎప్పటికీ నిన్ను మరచిపోలేను' అని ట్వీట్ చేసాడు.

మరోవైపు ఇదే ఢీ సినిమా గురించి ట్వీట్ చేసిన శ్రీను వైట్ల.. 'ఈ మూవీ నా కెరీర్‌ లో స్పెషల్ మూవీ. చాలా కష్టమైన సన్నివేశాలను కూడా అందరి సహకారంతో సులభంగా షూట్ చేసాం. ఈ చిత్రంలో భాగమైన ప్రతి ఒక్కరూ ఓ మధుర జ్ఞాపకమే. ఈ చిత్ర నిర్మాత - నా స్నేహితుడు ఎమ్ ఎస్ ఎన్ రెడ్డికి కృతజ్ఞతలు' అంటూ ట్వీట్ చేసాడు. ఇదిలా ఉండగా ఈ చిత్ర సీక్వెల్ ఢీ 2 గురించి చాలా కాలంగా మీడియాలో చర్చ జరుగుతోంది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో విష్ణుని ఢీ 2 గురించి ప్రశ్నించగా.. ఈ ప్రశ్నకి నా సోదరుడు శ్రీను వైట్లగారే సమాధానం చెప్పాలి అని అన్నాడు. ఇప్పటికే కష్టకాలంలో ఉన్న శ్రీను వైట్ల - మంచు విష్ణు.. మళ్ళీ సినిమాల్లోకి కంబ్యాక్ కోసం వెయిట్ చేస్తున్న జెనీలియా.. ఈ ముగ్గురు కలిసి మళ్ళీ 'ఢీ' కొడతారేమో చూడాలి.