Begin typing your search above and press return to search.

జెన్నీ రెండో కొడుకు ఫోటో చూశారా?

By:  Tupaki Desk   |   28 July 2016 4:17 PM GMT
జెన్నీ రెండో కొడుకు ఫోటో చూశారా?
X
టాలీవుడ్ హీరోయిన్ గా వెలిగిన హీరోయిన్ జెనీలియా.. కెరీర్ మంచి దశలో ఉండగానే బాలీవుడ్ యాక్టర్ రితేష్ దేశ్ ముఖ్ ని పెళ్లి చేసుకుని సెటిల్ అయిపోయింది. రీసెంట్ గా జెన్నీ తన రెండో సంతానంగా ఓ బాబుకు జన్మనిచ్చింది.

రితేష్- జెన్నీలకు రెండేళ్ల క్రితం ఓ బాబు పుట్టగా.. ఆ చిన్నారికి రియాన్ అనే పేరు పెట్టారు. ఇప్పుడు తమ రెండో బాబుకి రహైల్ అని పేరు పెట్టారు. ఈ చిన్నారి జన్మించి రెండు నెలలు కావస్తున్నా...ఇప్పటి వరకు ఫొటోలు విడుదల చేయలేదు. ఇప్పుడు జెనీలియా తన సోషల్ అకౌంట్ ద్వారా రహైల్ ఫోటోను ట్వీట్ చేసింది. తన చిన్ని బాబుని జెనీలియా ముద్దు పెట్టుకున్న ఫోటో విడుదల చేయగా.. దీనిలో రహైల్ మొహం కనిపించదు.

మొదటి బిడ్డ పుట్టినప్పటి నుంచి సినీ రంగానికి దూరంగా ఉన్న జెన్నీ.. గతేడాది రీఎంట్రీకి సిద్ధమని ప్రకటించింది. ఇలా అనౌన్స్ చేసిన కొద్ది కాలానికే మళ్లీ గర్భం దాల్చింది. తాజాగా మరో బాబు పుట్టడంతో జెనీలియా ఇప్పట్లో సినిమాల్లోకి వచ్చే ఛాన్సులు లేవని ఒప్పుకోవాల్సిందే.