Begin typing your search above and press return to search.

బొమ్మరిల్లు హాసిని వెనక్కొస్తోందోచ్‌

By:  Tupaki Desk   |   13 Aug 2015 4:52 AM IST
బొమ్మరిల్లు హాసిని వెనక్కొస్తోందోచ్‌
X
బొమ్మరిల్లు హాసినిగా తెలుగు ప్రేక్షకుల్ని మెప్పించింది జెనీలియా. ఆ తర్వాత టాలీవుడ్‌ లో చెప్పుకోదగ్గ సినిమాల్లోనే నటించింది. కాలక్రమంలో బాలీవుడ్‌ వెళ్లి అక్కడా తనదైన ముద్ర వేసింది. జానే తూ యా జానేనా, తేరా నాళ్‌ లవ్‌ హో గయా.. వంటి చిత్రాల్లో నటించింది. హీరో రితేష్‌ దేశ్‌ ముఖ్‌ ని పెళ్లాడి ఓ బిడ్డకు తల్లి కూడా అయ్యింది. కాకపోతే కేవలం ప్రైవేటు పార్టీల్లో, ఫ్యాష్‌ షోల్లో మాత్రమే కనిపించి, వెండితెరకు దూరమైంది.

గత మూడేళ్లుగా ముఖానికి రంగేసుకునేందుకు సన్నాహాలు చేస్తున్నా ఓ పూర్తి స్థాయి సినిమాతో రావడానికి వీలుపడలేదు. ఇన్నాళ్లుగా సంసారం బాధ్యతలు ఆ పని చేయనివ్వలేదు. కానీ ఇప్పుడు ఆ టైమ్‌ వచ్చింది. ఇక ముఖానికి రంగేసుకుని కరీనలా బిజీ అయిపోతోంది. వచ్చేస్తున్నా. మూడేళ్లు ఎంతో కష్టంగా గడిపాను.. అంటూ జెన్నీ తనలోని ఆవేదన బైటికి చెప్పుకుంది. భర్త రితేష్‌ ఎంకరేజ్‌ చేస్తూ .. ఇదో గ్రేట్‌ డే, యు బోర్న్‌ ఫర్‌ దిస్‌ అంటూ ట్వీట్‌ చేశారు. జెన్నీ వస్తోంది అంటే టాలీవుడ్‌ లోనూ ఫ్యాన్స్‌ ఉన్నారు. మన దర్శకనిర్మాతలు ఇక జెన్నీ వెంట క్యూ కట్టేస్తారేమో చూడాలి. వెల్‌కమ్‌ టు హాసినీ...