Begin typing your search above and press return to search.

జెన్నీ మళ్లీ క్యారీ చేస్తోంది

By:  Tupaki Desk   |   10 Dec 2015 11:52 PM IST
జెన్నీ మళ్లీ క్యారీ చేస్తోంది
X
జెనీలియా డిసౌజా బాలీవుడ్ రీఎంట్రీ కోసం ట్రై చేస్తోందంటూ ఈ మధ్య చాలానే వార్తలొచ్చాయి. వీటి మీద జెన్నీ కానీ.. వాళ్లాయన రితేష్ దేశ్ ముఖ్ కానీ నోరు మెదపలేదు. రీసెంట్ గా 2 వారాల క్రితం అంటే నవంబర్ 25న తమ చిన్నారి బాబు రియాన్ కి తొలి బర్త్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ జంట.

ఇప్పుడు జెనీలియా సినిమా సంగతులు కాకుండా.. మరో కొత్త విషయం చెప్పేందుకు రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. అదే రియాన్ కి త్వరలో తమ్ముడో, చెల్లెలో పుట్టబోతున్నారని ప్రకటిస్తారని టాక్స్ వినిపిస్తున్నాయి. జెన్నీ మరోసారి ప్రెగ్నెంట్ కావడంతోనే.. రీఎంట్రీ విషయాన్ని ఈ జంట పక్కన పెట్టేశారట. 2014లో ఓ బిడ్డకు జన్మనిచ్చిన ఈ జంట.. 2016లో మరో బేబీని కనబోతున్నారన్న మాట. అయితే.. ఈ విషయంపై ఇంకా రితేష్, జెనీలియాల నుంచి అఫీషియల్ అనౌన్స్ మెంట్ అయితే రాలేదు.

బాలీవుడ్ బెస్ట్ కపుల్ లో వీళ్లిద్దరి పేర్లు వినిపిస్తూ ఉంటాయి. కారణం ఏకంగా పదేళ్లపాటు ప్రేమించి, డేటింగ్ చేసి పెళ్లి చేసుకోవడమే. 2003లో తుఝే మేరీ కసమ్ షూటింగ్ లో ప్రేమలో పడ్డ రితేష్, జెన్నీలు.. 2013 నాటికి పెళ్లి చేసుకున్నారు.