Begin typing your search above and press return to search.

భర్త బూతు సినిమాలపై జెన్నీ ఫీలింగేంటి?

By:  Tupaki Desk   |   13 July 2016 10:55 AM GMT
భర్త బూతు సినిమాలపై జెన్నీ ఫీలింగేంటి?
X
మస్తీ.. గ్రాండ్ మస్తీ.. మస్తీ జాదే.. ఈ సినిమాల విశేషాల గురించి మాట్లాడ్డానికి కూడా ఇబ్బందిగా ఉంటుంది. వాటిలో ఉండే కంటెంట్ అలాంటిది మరి. ఎంత ప్రోగ్రెసివ్ ఆడియన్స్ అయినా సరే.. ఈ సినిమాలు చూస్తూ ఏదో ఒక సందర్భంలో తల వంచుకోవాల్సిందే. ఇక ఈ సినిమాల్ని లేడీస్ తో కలిసి చూడాలంటే చాలా కష్టం. ఒక హీరో ఒక సినిమాలో నటిస్తే తన భార్యను తీసుకెళ్లి ఆ సినిమా చూపించడం మామూలే. కానీ అడల్ట్ కామెడీ స్టార్ గా పేరుపడిన రితీశ్ దేశ్ ముఖ్ కు తన సినిమాల్ని జెనీలియాకు చూపించడం ఇబ్బందే. ఇప్పటికే అరడజను దాకా బూతు కామెడీల్లో నటించిన రితీశ్.. తాజాగా ‘గ్రేట్ గ్రాండ్ మస్తీ’ సినిమాతో ప్రేక్షకుల ముందుకొస్తున్నాడు.

మరి ఇలాంటి సినిమాల్లో నటిస్తూ.. జెన్నీని.. మిగతా కుటుంబ సభ్యులను ఎలా కన్విన్స్ చేస్తున్నావని రితీశ్ ను ఓ ఇంటర్వ్యూలో అడిగితే.. ఇలాంటి వృత్తిలో ఉన్నపుడు ఇవన్నీ కామన్ అని.. తన భార్య తనను అర్థం చేసుకుంటుందని అంటున్నాడు రితీశ్. ‘‘నటుడిగా తెరపై రకరకాల పాత్రలు పోషించాలి. నేను సినిమాల్లో వేసే వేషాల్నే బయట వేయను కదా. అలా చేస్తే చాలా చండాలంగా ఉంటుంది. నా కుటుంబం చాలా స్ట్రాంగ్.. ప్రోగ్రెసివ్ కూడా. అందుకే అడల్ట్ కామెడీల్లో నటించే విషయంలో రెండో మాట ఆలోచించను. ఇది కేవలం ఓ సినిమా అని నా కుటుంబ సభ్యులు అర్థం చేసుకున్నారు. నేను కేవలం జెనీలియా గురించే చెప్పట్లేదు.. నా తల్లి కూడా నన్ను అర్థం చేసుకుంది. వాళ్లు నన్ను గౌరవిస్తారు. అందుకే ఇలాంటి సినిమాలు చేయగలుగుతున్నా’’ అని సెలవిచ్చాడు రితీశ్. మస్తీ సిరీస్ లో మూడో సినిమా అయిన ‘గ్రేట్ గ్రాండ్ మస్తీ’ ఈ శుక్రవారమే ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సినిమాలో శ్రద్ధాదాస్ కూడా ఓ కీలక పాత్ర పోషించడం విశేషం.