Begin typing your search above and press return to search.

అల్ల‌రి హాసినికో అల్ల‌రోడు

By:  Tupaki Desk   |   26 Nov 2018 7:15 AM GMT
అల్ల‌రి హాసినికో అల్ల‌రోడు
X
అల్ల‌రి హాసిని అల్ల‌ర‌ల్ల‌రిని మ‌న‌ యూత్ అంత తేలిగ్గా మ‌ర్చిపోగ‌ల‌రా? బోయ్స్ సినిమాతో మొద‌లైన అల్ల‌రి - అటుపై బొమ్మ‌రిల్లుతో ప‌రాకాష్ట‌కే చేరింది. ప‌రుగు - సై - సాంబ‌ - స‌త్యం - రెడీ - హ్యాపీ - ఢీ - కింగ్ ఇలా ఎన్నో హిట్ చిత్రాల్లో న‌టించిన జెనీలియా ఆ త‌ర్వాత బాలీవుడ్‌ కి వెళ్లిపోవ‌డంతో సౌత్ ఫ్యాన్స్ త‌న‌పై ఎంతో అలిగారు. జెన్నీ ఫ్యాన్స్ జీవితంలోంచి అల్ల‌రి వ‌దిలి వెళ్లిపోయిందా అన్నంత నీర‌స‌ప‌డిపోయారు.

కేవ‌లం బాలీవుడ్‌కి వెళ్లిపోవ‌డమే కాదు.. అక్క‌డ ఏకంగా హీరో కం సీఎం స‌న్ రితేష్ దేశ్‌ ముఖ్‌ తో ల‌వ్‌ లో ప‌డి - అటుపై ఒక రియ‌ల్ ల‌వ్ అడ్వెంచ‌ర్‌ లో పోరాడి స‌క్సెసై ఇప్పుడు అత‌డి భార్య‌గా.. ఇద్ద‌రు పిల్ల‌ల‌కు మ‌మ్మీగా ఎంతో ట్రావెల్ అయిపోయింది జెన్నీ. అల్ల‌రి హాసిని ప్ర‌యాణం అంతా అల్ల‌ర‌ల్ల‌రే. కెరీర్ .. రియ‌ల్ లైఫ్ ప్ర‌తిదీ అల్ల‌రితో కూడుకున్న‌దే.

అందుకేనేమో త‌న‌కో అల్ల‌రోడు త‌గుల్కున్నాడు. ఇడిగో ఇక్క‌డ క‌నిపిస్తున్న ఆ చిన్నారి గ‌డుగ్గాయ్ నే ఆ అల్ల‌రోడు. పేరు రియాన్‌ దేశ్‌ ముఖ్‌. బుడి బుడి న‌డ‌క‌ల వ‌య‌సును దాటుకుని స్కూల్‌కి వెళ్లే ఏజ్‌ లో ఉన్నాడు. తీరిక చిక్కితే చాలు.. త‌న‌తో మామ్ జెన్నీ సంబ‌రంగా ఆటాడుకుంటోంది. నేడు బ‌ర్త్ డే వేళ ఇలా జోయ్‌ ఫుల్‌ గా సంబ‌రం చేసుకుంది జెన్నీ. అల్ల‌రిలో 1+1 ఆఫ‌ర్‌ లా ఆ వినోదాన్ని ఆస్వాధించిన వాళ్ల‌కు ఆస్వాధించినంత‌. ఇక జెనీలియా- రితేష్ జంట‌కు చిన్నారి రాహిల్ దేశ్‌ముఖ్ మ‌రో బోన‌స్ అనే చెప్పాలి.