Begin typing your search above and press return to search.

వీడియో: అల్ల‌రి హాసిని అంట్లు తోమిస్తోందిగా!

By:  Tupaki Desk   |   7 April 2020 4:00 PM IST
వీడియో: అల్ల‌రి హాసిని అంట్లు తోమిస్తోందిగా!
X
రితీష్ దేశ్ ముఖ్ - జెనెలియా డిసౌజా జంట అన్యోన్య‌త గురించి చెప్పాల్సిన ప‌నే లేదు. పెద్ద‌లు వ్య‌తిరేకించినా.. ప్రేమ‌ను గెలుచుకుని ఆద‌ర్శ దంప‌తులుగా నిలిచిన వైనం నిరంత‌రం అభిమానుల్లో స్ఫూర్తి నింపేదే. 2020 ఫిబ్రవరి 3 నాటికి ఈ జంట న‌టించిన `తుఝే మేరి తుఝే క‌స‌మ్` రిలీజై ద‌శాబ్ధంన్న‌ర‌ పైగానే అయ్యింది. ఈ జంట వివాహం జ‌రిగి ఎనిమిదేళ్లయ్యింది. క‌లిసి న‌టించ‌డం ప్రేమ‌లో ప‌డ‌డం అటుపై పెళ్లాడుకోవ‌డం ఇదంతా ఒక క‌ల‌లానే సాగింది. ఎప్ప‌టికీ ఈ జంట ఆద‌ర్శంగా నిలుస్తోంద‌నే అర్థ‌మ‌వుతోంది. రితేష్ జెనీలియాని క‌లుసుకున్న‌ప్ప‌టికి జెనీలియా డిసౌజా వ‌య‌సు 18 సంవత్సరాలు. కాలేజ్ కి వెళ్లేద‌ట‌.

ఇక రితేష్ .. జెన్నీతో ప్రేమ‌లో ప‌డ్డాక `కబీ ఖుషి కబీ ఘ‌మ్` చిత్రం చూడటానికి తీసుకెళ్లాడ‌ట‌. మొదటి మీటింగ్ లో జెనీలియా తనను ద్వేషించింద‌ట‌. అప్పటి మహారాష్ట్ర ముఖ్యమంత్రి కుమారుడు కావడంతో జెనెలియా తనను అహంకారిగా భావించింద‌ని రితీష్ తెలిపారు. అయితే పెళ్లి త‌ర్వాత‌ ఈ జంట ర‌క‌ర‌కాల‌ ఇంటర్వ్యూలు.. చాట్ షోలు .. మీడియా ఈవెంట్లలో ఒకరినొకరు అభినందించుకోవ‌డం ప్రేమ‌ను వ్య‌క్తం చేసుకోవ‌డం.. ప్రేమికుల్లో స్ఫూర్తిని నింపింది.

ప్ర‌స్తుతం జెనీలియా న‌టించ‌క‌ పోయినా.. రితేష్ ప‌లు మ‌ల్టీస్టార‌ర్ల‌లో న‌టిస్తూ బిజీగా ఉన్నాడు. ప్ర‌స్తుతం క‌రోనా లాక్ డౌన్ నేప‌థ్యంలో స్వీయ నిర్భంధంలో ఉన్న ఈ జంట కొన్ని వీడియో పోస్టుల‌తో ఫ్యాన్స్ కి ట‌చ్ లో ఉన్నారు. ఇక టిక్ టాక్ వీడియోల‌తోనూ ఫ్యాన్స్ ని యంగేజ్ చేస్తున్నారు. ఇంట్లో అంట్లు తోమాలంటే ఏ భ‌ర్త అయినా నామోషీ ఫీల‌వుతారు క‌దా! కానీ రితేష్ మాత్రం అలా కాదు. జెన్నీకి ఎంతో భ‌య‌ ప‌డుతున్నారు మ‌రి.. ఇది భ‌యం అనాలా..? లేక భార్య అంటే ప్రేమ అనాలా? అల్ల‌రి హాసిని ఫ‌న్ కూడా అదే రేంజులో ఉంది. ఈ ఫ‌న్నీ వీడియో ప్ర‌స్తుతం అభిమానుల్లో వైర‌ల్ గా మారింది.