Begin typing your search above and press return to search.

అచ్చు గుద్దిన‌ట్టు హీరో సూర్య‌లా .. ఎవ‌రీయ‌న‌?

By:  Tupaki Desk   |   7 April 2020 9:10 AM GMT
అచ్చు గుద్దిన‌ట్టు హీరో సూర్య‌లా .. ఎవ‌రీయ‌న‌?
X
భూమ్మీద మ‌నుషుల‌ను పొలిన మ‌నుషులు ఏడుగురుంటారని అంటారు. అప్పుడ‌ప్పుడు అలాంటి మ‌నుషులు తార‌సప‌డిన‌ప్పుడు నిజ‌మేన‌ని అనిపిస్తుంది. ఇలాంటి వారిని వెతికి ప‌ట్టుకోవ‌డంలో త‌న సినిమాల్లో డిస్ ప్లే చేయ‌డంలో ఆర్జీవీ అలియాస్ రామ్ గోపాల్ వ‌ర్మ స్పెష‌లిస్ట్. త‌న సినిమాలో రియాలిటీ కోసం రియ‌ల్ క‌థ‌లో ఉన్న పాత్ర‌ల‌ను అచ్చంగా అలా చూపించ‌డం కోసం.. అలాంటి ఆహార్యం ఉన్న వాళ్ల‌ను వెతికి ప‌ట్టుకోవ‌డం ఆయ‌నకే చెల్లింది. ముంబై దాడుల నేప‌థ్యంలో తెర‌కెక్కించిన సినిమా కోసం అదే రూపం ఉన్న ఓ వ్య‌క్తిని వెతికి ప‌ట్టుకుని ఆశ్చ‌ర్య‌ప‌రిచిన ఆర్జీవీ.. అటుపై `ల‌క్ష్మీస్ ఎన్టీఆర్`లో ఎన్టీఆర్ పాత్ర కోసం అలాంటి రూపం ఉన్న ఓ స్టేజీ ఆర్టిస్టును తీసుకొచ్చారు.. అందులో చంద్ర‌బాబు పాత్ర‌ కు యాప్ట్ న‌టుడినే ఎంపిక చేసుకుని మెప్పు పొందారు.

కాకా హోట‌ల్ లో స‌ర్వ‌ర్ కి అచ్చంగా అలా ఉన్నాడ‌ని అవ‌కాశం ఇచ్చిన డైరెక్ట‌ర్ ఎవ‌రైనా ఉన్నారా? అంటే అది ఆర్జీవీ మాత్ర‌మే. అలా వ‌ర్మ సేక‌రించిన కొన్ని పాత్ర‌ల‌ను చూస్తుంటే పై మాటే నిజ‌మే అనిపిస్తుంది. వ‌ర్మ కూడా ప్ర‌పంచంలో ఏడుగురు కాన్సెప్టును చాలా బ‌లంగా న‌మ్ముతాడ‌ని ప్రూవైంది. అదంతా స‌రే కానీ.. తాజాగా త‌మిళ హీరో సూర్య పోలిక‌ల‌తో ఉన్న ఓ వ్య‌క్తి ఫోటో ఇన్ స్టాగ్రామ్ లో జోరుగా వైర‌ల్ అవుతోంది. అత‌ను సేమ్ టు సూమ్ సూర్య‌లా ఉన్నాడు. సూర్య‌..కార్తీ బ్ర‌ద‌ర్స్ అయినా ఇద్ద‌రు ఒకేలా ఉండ‌రు. కానీ ఇత‌ను మాత్రం సూర్య‌కి ప‌ర్ ఫెక్ట్ బ్ర‌ద‌ర్ లా ఉన్నాడు.

సాధార‌ణంగా ఒకే రూపంతో క‌లిసి పుట్ట‌డం అనేది ట్విన్స్ (క‌వ‌ల పిల్ల‌లు) లో మాత్ర‌మే చూస్తాం. కానీ తాజాగా వైర‌ల్ అవుతోన్న వీడియో చూస్తూ అచ్చంగా సూర్య ముఖం... కళ్లు.. ఆ మీస‌క‌ట్టు.. బాడీ స్టైల్ అన్నీ ఒకేలా ఉన్నాయి. ఇంత‌కీ ఎవ‌రీయన‌ అంటే? బాలీవుడ్ న‌టి జెనీలియా కజిన్ అంట‌. జెనీలీయా అత‌డి ఫోటోని షేర్ చేసింది. అత‌డి పేరు ధీర‌జ్ అని తెలిసింది.