Begin typing your search above and press return to search.

భ‌ర్త చేసిన ప‌నికి వీర కొట్టుడు కొట్టిన జెనీలియా..వీడియో వైర‌ల్‌! జెనీలియా

By:  Tupaki Desk   |   14 Feb 2022 7:33 AM GMT
భ‌ర్త చేసిన ప‌నికి వీర కొట్టుడు కొట్టిన జెనీలియా..వీడియో వైర‌ల్‌! జెనీలియా
X
ఈ పేరుకు కొత్త‌గా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. హిందీ మూవీతో సినీ కెరీర్ స్టార్ట్ చేసిన జెనీలియా.. శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన‌ `బాయ్స్` సినిమాతో తెలుగు ప్రేక్ష‌కుల‌ను తొలిసారి ప‌ల‌క‌రించింది. ఆ త‌ర్వాత వ‌రుస చిత్రాలు చేసిన ఈ బ్యూటీ.. `బొమ్మరిల్లు` మూవీతో హాసినిగా ప్రేక్ష‌కుల మ‌దిలో చెర‌గ‌రాని ముద్ర వేసుకుంది.

తెలుగులో ఈమె చేసింది త‌క్కువ సినిమాలే అయినా ఎక్కువ హిట్లు అందుకుని స్టార్ స్టేట‌స్‌ను ద‌క్కించుకుంది. హిందీ, త‌మ‌ళ‌, క‌న్న‌డ భాష‌ల్లోనూ న‌టించిన జెనీలియా.. కెరీర్‌లో పీక్స్‌లో ఉన్న‌ప్పుడే త‌మ మొద‌టి సినిమా హీరో, మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి విలాస్ రావ్ దేశ్‌ముఖ్ తనయుడు రితేశ్ దేశ్‏ముఖ్‏ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. పెళ్లి త‌ర్వాత సినిమాల‌కు గుడ్‌బై చెప్పేసిన జెనీలియా.. త‌న పూర్తి సమయాన్ని కుటుంబానికి కేటాయించింది. ఇద్ద‌రు పిల్ల‌ల‌కు త‌ల్లి కూడా అయింది.

అయితే పిల్ల‌లు ఇప్పుడు ఎలాగో పెద్ద వారు అవ్వ‌డంతో.. జెనీలియా సెకెండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసి ప‌లు ప్రాజెక్ట్స్‌ను టేక‌ప్ చేసింది. ఇక‌పోతే సోష‌ల్ మీడియాలో సూప‌ర్ యాక్టివ్‌గా ఉండే జెనీలియా.. నిత్యం ఏదో ఒక వీడియోతో త‌న ఫాలోవ‌ర్స్‌ను అల‌రిస్తుంటుంది. ఈ నేప‌థ్యంలోనే తాజాగా కూడా ఓ వీడియోను షేర్ చేసింది.

ఇందులో జెనీలియా, రితేష్‌లిద్దరూ `నాచ్ నాచ్ నాచ్` అనే పాటకు డ్యాన్స్ చేయ‌డం స్టార్ట్ చేస్తారు. అయితే సాంగ్‌ ఒకే రిథమ్‌లో వెళుతుండడంతో జెనీలియా డ్యాన్స్‌ చేయడం ఆపేస్తుంది. కానీ రితేష్‌ మాత్రం ఉత్సాహంగా డ్యాన్స్‌ కొనసాగిస్తాడు. జెనీలియా ఆపరా బాబూ అంటున్నా ఆప‌డు. దాంతో జెనీలియాకి చిర్రెత్తుకొచ్చి భ‌ర్త‌ను వీర కొట్టుడు కొడుతుంది. మొత్తానికి సూప‌ర్ ఫ‌న్నీగా ఉన్న ఈ వీడియో నెట్టింట తెగ వైర‌ల్ అవుతోంద‌.