Begin typing your search above and press return to search.

జూనియర్ ఎన్టీఆర్ తో జెమిని..?

By:  Tupaki Desk   |   2 March 2021 8:35 AM GMT
జూనియర్ ఎన్టీఆర్ తో జెమిని..?
X
బిగ్ బీ అమితాబ్ బచ్చన్ హిందీలో సక్సెస్ ఫుల్ గా హోస్టింగ్ చేస్తోన్న 'కౌన్ బనేగా కరోడ్‌ పతి' అనే షోను తెలుగులో 'మీలో ఎవరు కోటీశ్వరుడు' పేరుతో చేసిన విషయం తెలిసిందే. స్టార్ మా ఎంటర్టైన్మెంట్ ఛానల్ వారు దీనికి నిర్వహకులుగా వ్యవహరించారు. 'కింగ్' అక్కినేని నాగార్జున హోస్టుగా మొదటి మూడు సీజన్స్ విజయవంతంగా చేశారు. అయితే మెగాస్టార్ చిరంజీవితో చేసిన నాల్గవ సీజన్ అనుకున్నంత స్థాయిలో ఆడియెన్స్ ని ఎట్రాక్ట్ చేయ‌లేక‌పోయింది. దీంతో 'స్టార్ మా' ఈ కాన్సెప్ట్ ని వ‌దిలేసుకుందని టాక్ నడుస్తోంది. అయితే ప్ర‌స్తుతం జెమిని టీవీ వారు ఈ షోను నిర్వ‌హించ‌డానికి ప్లాన్ చేస్తున్న‌ట్లుగా స‌మాచారం.

అంతేకాకుండా జెమినీ వారు నిర్వహించే 'మీలో ఎవ‌రు కోటీశ్వ‌రుడు షో' కి యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్టుగా వ్యవహరిస్తారని టాలీవుడ్‌ లో టాక్ కూడా వినిపిస్తోంది. 'బిగ్ బాస్' తెలుగు రియాలిటీ షో ఫస్ట్ సీజన్‌ ని సక్సెస్ ఫుల్ గా హోస్ట్ చేసిన తారక్.. నటుడిగానే కాకుండా టీవీ హోస్టుగానూ అదరగొట్టగలనని నిరూపించుకున్నాడు. ఈ క్రమంలో ఇప్పుడు జెమిని వారు ఆయనతో సంప్రదింపులు జరుపుతున్నారట. అయితే ఇదే సమయంలో ఎన్టీఆర్ హోస్ట్ చేయబోయేది 'మీలో ఎవరు కోటీశ్వరుడు' షో కాదని.. జెమినీ వారు ప్లాన్ చేస్తున్న అదే తరహా మరో షో అనే టాక్ కూడా వినిపిస్తోంది. మరి ప్రస్తుతం సినిమాలతో బిజీగా ఉన్న తారక్.. టీవీ షో హోస్ట్ చేసేది లేనిది తెలియాలంటే ఇంకొన్నాళ్లు ఆగాల్సిందే.