Begin typing your search above and press return to search.

జెమిని టీవీ మరింత దూకుడు

By:  Tupaki Desk   |   28 Jun 2021 6:36 AM GMT
జెమిని టీవీ మరింత దూకుడు
X
తెలుగు ఎంటర్‌ టైన్ మెంట్‌ ఛానెల్స్ లో ఒకప్పుడు జెమిని టీవీ టాప్‌ లో ఉండేది. కాని ఇప్పుడు మాత్రం స్టార్‌ మా.. జీ తెలుగు.. ఈటీవీల తర్వాత స్థానంలో జెమిని టీవీ ఉంది. మళ్లీ జెమిని టీవీకి కళ తీసుకు వచ్చేందుకు నిర్వాహకులు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. పెద్ద సినిమాలను కొనుగోలు చేయడంతో పాటు రియాల్టీ షో ల విషయంలో ఇతర ఛానెల్స్ తో పోటీ పడేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగానే గతంలో స్టార్‌ మా లో వచ్చిన మీలో ఎవరు కోటీశ్వరుడు షో ను జెమిని లో ఎవరు మీలో కోటీశ్వరులు గా తీసుకు వస్తున్నారు. ఎన్టీఆర్‌ హోస్ట్‌ అవ్వడం వల్ల టాప్ రేటింగ్‌ ఖాయం అంటున్నారు.

కేవలం ఎవరు మీలో కోటీశ్వరులు షో తో నే కాకుండా మరిన్ని షో లను కూడా తీసుకు రాబోతున్నారు. బిగ్‌ బాస్ షో నిర్మాణ సంస్థ అయిన ఎండమోల్‌ సంస్థ వారితో కలిసి మాస్టర్‌ చెఫ్‌ షో ను చేయబోతున్నారు. ఈ షో కు హోస్ట్‌ గా తమన్నా వ్యవహరించబోతుంది. ఇది ఒక వంటల షో మాత్రమే కాకుండా ఆకట్టుకునే టాక్‌ షో కూడా అంటూ జెమిని వారు చెబుతున్నారు. ఈ షో కు క్రేజ్‌ పెంచేందుకు ప్రోమోను సిద్దం చేశారు.

తమన్నా మరియు విజయ్‌ సేతుపతితో ప్రోమోను షూట్‌ చేశారు. అతి త్వరలోనే జెమిని టీవీలో ఈ ప్రోమో ను టెలికాస్ట్‌ చేయబోతున్నారు. తెలుగులో కూడా స్టార్‌ స్టేటస్ కలిగిన విజయ్‌ సేతుపతి మరియు స్టార్‌ హీరోయిన్‌ తమన్నాలు ఆన్‌ స్క్రీన్‌ మీద కనిపిస్తే ఖచ్చితంగా షో పై అంచనాలు ఆకాశాన్ని తాకడం ఖాయం. అందుకే జెమిని వారు ఆయన్ను తీసుకు వచ్చారని టాక్‌ వినిపిస్తుంది. ఈ వరుస షో లతో జెమిని టీవీ ఖచ్చితంగా దూకుడుగా ఇతర ఛానెల్స్ కు పోటీగా నిలుస్తుందనే నమ్మకం వ్యక్తం అవుతోంది. ఎవరు మీలో కోటీశ్వరులు మరియు మాస్టర్‌ చెఫ్‌ ల టెలికాస్ట్‌ డేట్స్ కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.