Begin typing your search above and press return to search.

మహానటి మూవీలో ఆ రోల్ ఎవరికో!!

By:  Tupaki Desk   |   12 March 2017 11:10 AM
మహానటి మూవీలో ఆ రోల్ ఎవరికో!!
X
ఓ ఏడాదిగా వినిపిస్తున్న ప్రాజెక్ట్ మహానటి. సావిత్రి జీవిత చరిత్రను సినిమాగా ఆవిష్కరించే ప్రయత్నం చాలా నెలల క్రితమే ప్రారంభం కాగా.. ఉమెన్స్ డే సందర్భంగా.. సావిత్రి.. కీర్తి సురేష్.. సమంతల ఫోటోలతో ఇచ్చిన పోస్టర్ తో అధికారికంగా అనౌన్స్ చేశారు. సావిత్రిగా కీర్తి సురేష్.. జమున పాత్రలో సమంత నటించబోతున్నారు.

దీంతో ఇప్పుడు ఎన్టీఆర్.. ఏఎన్నార్ రోల్స్ ఎవరు చేయనున్నారనే టాక్ ఎక్కువగానే ఉంది. అయితే.. సావిత్రి జీవతంలో వీరికంటే ప్రధానమైన పాత్ర మరొకరికి ఉంటుంది. ఆయనే జెమినీ గణేశన్. అటు రీల్ లైఫ్ లోను.. ఇటు రియల్ లైఫ్ లోను సావిత్రి లైఫ్ లో ఈయన పాత్ర చాలా కీలకం. జెమినీ గణేశన్ కు సావిత్రి మూడో భార్య. మొదటి భార్య అలమేలు కాగా.. రెండో భార్య పుష్పవల్లి. ఈ రెండో భార్యకు పుట్టిన కూతురే బాలీవుడ్ నటి రేఖ.

ఆ తర్వాతే సావిత్రిని పెళ్లాడారు జెమినీ గణేశన్. వీర వివాహం జరిగిన మూడేళ్ల తర్వాత కానీ ప్రపంచానికి ఈ విషయం తెలియలేదు. ఈ వివాహం కారణంగానే సావిత్రి సినిమా కెరీర్ పాడయిపోయిందని చాలా మందిని అంటూ ఉంటారు. మరి ఇప్పుడీ జెమినీ గణేశన్ రోల్ లేకుండా సావిత్రి బయోపిక్ కంప్లీట్ అయ్యే అవకాశం లేదు. ఈ పాత్రకు దర్శకుడు నాగ్ అశ్విన్ ఎవరిని ఎంపిక చేసుకుంటాడనే ఆసక్తి అంతటా కనిపిస్తోంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/