Begin typing your search above and press return to search.

బిగ్ బాస్ లీక్స్.. స్ట్రాంగ్ కంటెస్టెంట్ హౌస్ కి గుడ్ బై..!

By:  Tupaki Desk   |   5 Nov 2022 12:44 PM GMT
బిగ్ బాస్ లీక్స్.. స్ట్రాంగ్ కంటెస్టెంట్ హౌస్ కి గుడ్ బై..!
X
బిగ్ బాస్ సీజన్ 6 నుంచి 10వ వారం ఎవరు ఎలిమినేట్ అవుతున్నారన్నది లీక్ అయ్యింది. ఒకప్పుడు బిగ్ బాస్ షో లైవ్ చూసేంతవరకు ఎవరు ఎలిమినేట్ అన్నది తెలిసేది కాదు. కానీ ఇప్పుడు ప్రతివారం ఎవరు ఎలిమినేట్ అవుతున్నారో ఒకరోజు ముందే లీక్ అవుతుంది. దానికి కారణం ఆ ఎపిసోడ్ ముందు రోజే షూట్ చేయడమే. బిగ్ బాస్ టీం నుంచే ఈ లీక్స్ జరుగుతున్నాయని చెప్పొచ్చు. బిగ్ బాస్ సీజన్ 6 లో 10వ వారం 10 మంది నామినేషన్స్ లో నిలిచారు. ముఖ్యంగా స్ట్రాంగ్ కంటెస్టంట్స్ అంతా కూడా ఈ వారం నామినేషన్స్ లో ఉన్నారు.

కెప్టెన్ అవడం వల్ల శ్రీహాన్ నామినేషన్స్ నుంచి సేఫ్ అవ్వగా లాస్ట్ వీక్ ఆట బాగా ఆడటంతో రాజ్, వాసంతిలు నామినేషన్స్ నుంచి తప్పించుకున్నారు. అందుకే ఈ వారం నామినేషన్స్ లో ఇనయ, గీతు, రేవంత్, ఆదిత్య, శ్రీ సత్య, కీర్తి, ఫైమా, రోహిత్, అది రెడ్డి, మెరినా లు ఉన్నారు. ఇక వీరిలో అతి తక్కువ ఓట్లు వచ్చిన వారిని ఎలిమినేట్ చేస్తారు. శుక్రవారం రాత్రి 12 గంటలకే ఓటింగ్స్ క్లోజ్ కాగా ఈ వారం ఎలిమినేట్ అయిన హౌస్ మెట్ ఎవరన్నది లీక్ అయ్యింది. హౌస్ నుంచి ఈ వారం ఓ స్ట్రాంగ్ కంటెస్టంట్ ఎలిమినేట్ అయినట్టు తెలుస్తుంది. ఆమె ఎవరో కాదు గీతు రాయల్. బిగ్ బాస్ రివ్యూస్ ఇస్తూ యూట్యూబర్ గా క్రేజ్ తెచ్చుకున్న గీతు ఆ తర్వాత కొన్నాళ్లు జబర్దస్త్ లో కూడా కొన్ని ఎపిసోడ్స్ చేసింది.

బిగ్ బాస్ తన డ్రీం అని.. ఇక్కడ రావడంతో ప్రతి మూమెంట్ ఎంజాయ్ చేస్తుంటానని చెప్పుకొచ్చిన గీతు ఆట మీద కన్నా ఎక్కువగా లూపులు వెతుకుతూ అతి తెలివి ప్రదర్శించింది. అందుకే ఆమె హౌస్ నుంచి బయటకు రావాల్సి వచ్చింది. అంతేకాదు ఈ వారం జరిగిన కెప్టెన్సీ టాస్క్ లో తనని నమ్మిన ఆదిరెడ్డినికూడా గీతు చీట్ చేసి తన టీం ని గెలిపించింది. అందుకే ఆమె మీద మరింత నెగటివ్ ఇంప్యాక్ట్ పడ్డది. ఇదే కాదు కెప్టెన్సీ టాస్క్ లో బాలాదిత్య సిగరెట్లు, లైటర్ దాచి పెట్టి కూడా తప్పు చేసింది గీతు. హౌస్ మెట్స్ ని పర్సనల్ గా సాధించడం అనేది సరైన ఆట తీరు కాదు. బాలాదిత్య ఆ విషయంలో చాలా హర్ట్ అయ్యాడు. ఆ విషయంలో కూడా గీతుకి మైనస్ మార్కులు పడ్డాయి. ఫైనల్ గా ఇవన్ని ఆమె ఎలిమినేషన్ కి దారి తీశాయి. అంతేకాదు ఆమె నోరు కూడా అదుపులో లేకుండా మాట్లాడింది. ఇదంతా గీతు కంటెంట్ ఇచ్చేందుకే అని తెలిసినా ఆట మీద కాకుండా ఇలా కేవలం మాటలతోనే ఆమె కొనసాగుతుండటం చూసి ఆడియన్స్ కి బోర్ కొట్టేసింది.

ఫలితంగా బిగ్ బాస్ హౌస్ నుంచి ఆమెని ఎలిమినేట్ అయ్యేలా చేశారు. లాస్ట్ వీక్ సంచాలక్ గా చేసిన గీతు ఆట ఎలా జరుగుతుందో చూడటం మాని తను చెప్పినట్టు ఆట ఆడాలని.. అందులో తను కూడా కలుగచేసుకుని ఆటని డిస్ట్రబ్ చేసింది. ఆట టైం లోనే గీతు మీద ప్రేక్షకులకు ఒక నెగటివ్ ఇంప్యాక్ట్ కలిగింది. ఈ వారం కూడా పెద్దగా గేమ్ ఆడకపోగా ఆమె తనని నమ్మిన ఆది రెడ్డిని.. బాలాదిత్యాని ఇబ్బంది పెట్టడం వల్ల కూడా ఆమెని బయటకు పంపించేశారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.