Begin typing your search above and press return to search.

బిగ్ బాస్ విన్న‌ర్.. ర‌న్న‌ర్ వారేనా?

By:  Tupaki Desk   |   30 Sep 2018 4:56 AM GMT
బిగ్ బాస్ విన్న‌ర్.. ర‌న్న‌ర్ వారేనా?
X
బిగ్ బాస్ సీజ‌న్ 2కు చివ‌రి రోజు ఇదే. మ‌రికొద్ది గంట‌ల్లో గ్రాండ్ ఫైన‌ల్‌ కు సంబంధించిన ఎపిసోడ్ టెలికాస్ట్ కానుంది. వంద రోజులు ఒక ఇంట్లో ఉండి.. బ‌య‌ట ప్ర‌పంచంతో సంబంధం లేకుండా ఉండ‌టం అంత తేలికైన విష‌యం కాదు. ఒక ప్ర‌త్యేక ప్ర‌పంచంలో ఎప్పుడు ప‌గ‌లు అవుతుందో.. ఎప్పుడు రాత్రి అవుతుందో తెలీని ప‌రిస్థితుల్లో.. ఆక‌లితో ఉండే క‌డుపులతో ఎప్ప‌టిక‌ప్పుడు ఫిట్టింగుల‌తో పాటు.. టాస్క్ ల‌ను పూర్తి చేయ‌టానికి ఉరుకులు ప‌రుగులు తీయాల్సిన పరిస్థితి.

మ‌రే ప‌ని లేకుండా.. అవ‌త‌లోడి మీద గేమ్ ఆడ‌ట‌మే లక్ష్యంగా ఒక డ‌జ‌ను మంది ఉంటే.. రాజ‌కీయాల‌కు కొద‌వ ఉండ‌దు. అలాంటి వేళ‌.. యాక్టివ్ గా ఉంటూ.. పాజిటివ్ ఆటిట్యూడ్ తో వెళుతూ.. త‌మ‌ను చూసే ప్రేక్ష‌కుల మ‌దిని గెలుచుకోవ‌టం అంత తేలికైన విస‌యం కాదు. అలాంటి ప‌ని ఎవ‌రు చేశారు? బిగ్ బాస్ సీజ‌న్ 2లో విజేత ఎవ‌రు? అన్న‌ది ఇప్పుడు ఆస‌క్తిక‌ర ప్ర‌శ్న‌గా మారింది.

టాప్ 5లో కౌశ‌ల్‌.. గీత‌.. సామ్రాట్‌.. దీప్తి.. త‌నీశ్ లు ఉన్న‌ప్ప‌టికీ.. గెలిచేది మాత్రం ఒక్క‌రే. బిగ్ బాస్ సీజ‌న్ 2కు సంబంధించిన లీకుల పెద్ద ఎత్తున బ‌య‌ట‌కు రావ‌టం తెలిసిందే. ఒక‌ర‌కంగా చెప్పాలంటే.. బిగ్ బాస్ ను టీవీల్లో ఫాలో అయ్యే దాని కంటే సోష‌ల్ మీడియాలో ఫాలో అయ్యే వారే ఎక్కువ‌న్న జోక్ లేక‌పోలేదు. ఎవ‌రు ఎప్పుడు ఎలిమినేట్ అవుతారు.. ఎవ‌రు ఎప్పుడు త‌మ ఎంట్రీతో స‌ర్ ప్రైజ్ చేస్తార‌న్న విష‌యాన్ని ఎప్ప‌టిక‌ప్పుడు లీకుల రూపంలో బ‌య‌ట‌కు రావ‌టం.. అందుకు త‌గ్గ‌ట్లే జ‌ర‌గ‌టంతో లీకుల్ని న‌మ్ముకోవ‌టం ఈ మ‌ధ్య‌న ఎక్కువైంది.

ఈ లీకుల్ని అడ్డుకునేందుకు బిగ్ బాస్ ఎంత ప్ర‌య‌త్నం చేసినా వ‌ర్క్ వుట్ కాలేద‌ని చెబుతున్నారు. ఇదిలా ఉండ‌గా.. బిగ్ బాస్ ఫైన‌ల్ మీద సోష‌ల్ మీడియాలో వ‌స్తున్న లీకుల మాటేంది? అన్న‌ది చూస్తూ.. బిగ్ బాస్ సీజ‌న్ 2 విజేత‌గా కౌశ‌ల్ టైటిల్ సొంతం చేసుకుంటార‌ని చెబుతున్నారు. ర‌న్న‌ర్ గా ప్ర‌ముఖ సింగ‌ర్‌.. గీతామాధురి నిలుస్తుంద‌ని చెబుతున్నారు.

ఈ రోజు (ఆదివారం) రాత్రి టెలికాస్ట్ అయ్యే ఎపిసోడ్‌ కు సంబంధించిన ఫోటోలు వైర‌ల్ అవుతున్నాయి. నాని ప‌క్క‌నే నిలుచొని మాట్లాడుతున్న కౌశ‌ల్ ఫోటోలు వైర‌ల్ అవుతున్నాయి. బిగ్ బాస్ షోను త‌న చేతుల్లోకి తీసుకొని న‌డిపించిన కౌశ‌ల్ ఆర్మీ.. చివ‌ర‌కు త‌మ నాయకుడ్ని విజేత‌గా గెలిపించుకోగ‌లిగిందా? బిగ్ బాస్ కంటే తాము ప‌వ‌ర్ ఫుల్ అని కౌశ‌ల్ ఆర్మీ ఫ్రూవ్ చేసుకుందా? అన్న‌ది ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింది. మ‌రి.. ఈ బిగ్ లీక్ లో నిజం ఎంత‌న్న‌ది తేలాలంటే మాత్రం కొద్ది గంట‌లు వెయిట్ చేయాల్సిందే.