Begin typing your search above and press return to search.

గీత గోవిందం సీక్వెల్ తీస్తారా?

By:  Tupaki Desk   |   27 Jan 2020 4:43 AM GMT
గీత గోవిందం సీక్వెల్ తీస్తారా?
X
ఒకే ఒక్క ఐడియా జీవితాన్ని మార్చేసిన‌ట్టు ఒకే ఒక్క‌ బ‌స్ట‌ర్ ఎంద‌రివో జీవితాల్ని మార్చేసింది. 2018లో రిలీజైన గీత గోవిందం విజ‌య్ దేవ‌ర‌కొండ ఇమేజ్ ని అమాంతం స్కైలోకి పెంచింది. అలాగే ర‌ష్మిక‌ను స్టార్ హీరోయిన్ స్టాట‌స్ వైపు అడుగులు వేసేలా చేసింది. ఇక ఈ సినిమాని తెర‌కెక్కించిన జీఏ2 అధినేత బ‌న్ని వాస్ కి ఆ సినిమాకి ప‌ని చేసిన టెక్నిక‌ల్ టీమ్ కి అంద‌రికీ పేరొచ్చింది.

అయితే ద‌ర్శ‌కుడు ప‌ర‌శురామ్ ఫేట్ మాత్రం వేరొక‌లా ట‌ర్న్ అయ్యింది. అత‌డికి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చేసిన స్టార్ హీరో మ‌హేష్ ఎందుక‌నో ఆ త‌ర్వాత మ‌న‌సు మార్చుకోవ‌డంతో పూర్తి డైల‌మాలో ప‌డిపోయాడు. దాంతో ప‌ర‌శురామ్ కి బిగ్ గ్యాప్ వ‌చ్చేసింది. మ‌హేష్ కోసం ఎదురు చూసి చివ‌రికి యువ‌హీరోల చుట్టూ తిరిగాడు. ఎట్ట‌కేల‌కు అక్కినేని నాగ‌చైత‌న్య‌ను లాక్ చేశాడు. అత‌డి కోసం స్క్రిప్టును పూర్తి స్థాయిలో సిద్ధం చేస్తున్నాడు. ఈ కాంబినేష‌న్ మే నుంచి షూటింగుకి వెళ్ల‌నున్నారు.

ఇదిలా ఉండ‌గానే ప‌ర‌శురామ్ మ‌రో స్క్రిప్టును దేవ‌రకొండ కోసం సిద్ధం చేశాడ‌ని తెలిసింది. మ‌రోసారి జీఏ2 బ్యాన‌ర్ లోనే దేవ‌ర‌కొండ‌- ప‌ర‌శురామ్ సినిమా చేయ‌నున్నారు. ఇప్ప‌టికే స్టోరీ లైన్ బ‌న్నీకి రౌడీకి న‌చ్చేసింద‌ట‌. దీంతో పూర్తి స్థాయిలో వ‌ర్క్ చేస్తున్నాడు ప‌ర‌శురామ్. ఇటు చైత‌న్య‌తో క‌మిట్ మెంట్ అయిపోగానే ప‌ర‌శురామ్ అందుబాటులోకి వ‌స్తాడు. అటు దేవ‌ర‌కొండ ఫైట‌ర్ క‌మిట్ మెంట్ ను పూర్తి చేసి ప‌ర‌శురామ్ కి కాల్షీట్లు కేటాయిస్తాడ‌ని చెబుతున్నారు. ఇదే నిజ‌మైతే ఈ కాంబినేష‌న్ నుంచి మ‌రోసారి గీత గోవిందం మ్యాజిక్ రిపీట‌వుతుందేమో చూడాలి. ఇంత‌కీ ఈ స్క్రిప్టు గీత గోవిందంకి సీక్వెల్ కాదు క‌దా? ఆ సంగ‌తిని ప‌ర‌శురామ్ స్వ‌యంగా చెప్పాల్సి ఉంటుంది.