Begin typing your search above and press return to search.

గూఢచారికి గోవిందుడి గండం

By:  Tupaki Desk   |   17 Aug 2018 4:15 AM GMT
గూఢచారికి గోవిందుడి గండం
X
బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాస్టింగ్ హిట్ గా నిలిచిన గీత గోవిందం ప్రభావం గత వారం విడుదలైన సినిమాలపై పడుతోంది. అడవి శేష్ కెరీర్ లోనే పెద్ద హిట్ గా దూసుకుపోతున్న గూఢచారిపై దీని ఎఫెక్ట్ బాగానే పడేలా ఉంది. స్పై థ్రిల్లర్ గా 3వ తేదీ విడుదలైన గూఢచారిపై రివ్యూస్ తో పాటు మౌత్ పబ్లిసిటీ చాలా పాజిటివ్ గా ఉండటం కలిసి వచ్చింది. దానికి తగ్గట్టే ఓవర్ సీస్ లో మిలియన్ మార్క్ దిశగా వెళ్లడం టీమ్ లో ఉత్సాహాన్ని నింపింది. ఈ లోపు గీత గోవిందం రావడం తో సీన్ మెల్లగా మారిపోతోంది. ఇప్పటి దాకా గూఢచారి 0.7 మిలియన్ డాలర్లతో స్ట్రాంగ్ గా ఉంది. టార్గెట్ చేరుకోవడం పెద్ద కష్టం కాదు కానీ 10 రోజులు పూర్తవ్వడంతో కాస్త స్లో అయ్యింది. దీంతో స్పెషల్ గా ప్రమోట్ చేసే ఉద్దేశంతో గూఢచారి టీమ్ యుఎస్ ట్రిప్ ప్లాన్ చేసుకుంది. ఆగస్ట్ 17 నుంచి 26 దాకా వరసగా న్యూ జెర్సీ-డెలాయిట్-డల్లాస్-చికాగో-సియాటెల్ తదితర ప్రాంతాలన్నీ చుట్టేస్తున్నారు. నేరుగా ప్రేక్షకులను కలిస్తే మైలేజ్ వస్తుందనే ఉద్దేశంతో గతంలో ధృవ వాడిన ఫార్ములానే ఫాలో అవుతున్నారు.

కానీ అనూహ్యంగా గీత గోవిందం బ్లాక్ బస్టర్ దిశగా వెళ్తుండటం గూఢచారిని టెన్షన్ పెడుతోంది. లవ్ స్టోరీతో పాటుగా ఫ్యామిలీ ఆడియన్స్ ని ఆకర్షించే అంశాలు అందులో ఉండటంతో సహజంగానే ఫ్లోటింగ్ ఎక్కువగా ఉంది. దీంతో యాక్షన్ జానర్ కే పరిమితమైన గూఢచారి మీద ఆ ఎఫెక్ట్ ఉండటం సహజం. గీత గోవిందం ఒకవేళ జస్ట్ యావరేజ్ అనిపించుకున్నా ఇంత ఆందోళన ఉండేది కాదు. ఈజీగా మిలియన్ మార్క్ దాటేసి దూసుకుపోతున్న గీత గోవిందం వల్ల జరగబోయే డ్యామేజీని ముందే ఊహించి అలెర్ట్ అయ్యారో లేక ప్లాన్ చేసుకున్నాక ఈ ప్రభంజనం చూస్తున్నారో కానీ మొత్తానికి భారీ బడ్జెట్ సినిమాల వల్ల రాని ఎఫెక్ట్ ఓ లవ్ స్టోరీ వల్ల గూఢచారి మీద పడటం ఆశ్చర్యమే. అడవి శేష్ టీమ్ మాత్రం కాన్ఫిడెంట్ గా ఉంది. రెండు ఒకదానికి ఒకటి ఏ మాత్రం సంబంధం లేని జానర్లు కావడంతో తర్వాత అయినా మిగిలిన టార్గెట్ పూర్తి చేస్తాము అంటోంది. మరి అమెరికా సక్సెస్ టూర్ ఎంత వరకు ఫలితాలు ఇస్తుంది అనేది కొద్దీ రోజులు వేచి చూస్తే తెలిసిపోతుంది.