Begin typing your search above and press return to search.

అక్కడికి గీత గోవిందం.. వర్కౌట్‌ అయ్యేనా?

By:  Tupaki Desk   |   5 Jan 2019 3:45 PM GMT
అక్కడికి గీత గోవిందం.. వర్కౌట్‌ అయ్యేనా?
X
ఈమద్య కాలంలో తెలుగులో సూపర్‌ హిట్‌ అయిన సినిమాలను బాలీవుడ్‌ లో రీమేక్‌ చేయడం పరిపాటి అయ్యింది. ఇటీవలే తెలుగు మూవీ ‘టెంపర్‌’ ను హిందీలో రీమేక్‌ చేశారు. రణ్‌ వీర్‌ సింగ్‌ నటించిన ‘టెంపర్‌’ రీమేక్‌ సింబా మూవీ ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. 200 కోట్ల వసూళ్లను సింబా దక్కించుకున్నట్లుగా చెబుతున్నారు. ఈ సమయంలోనే మరో తెలుగు సినిమాను హిందీలో రీమేక్‌ చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నట్లుగా సమాచారం అందుతోంది.

విజయ్‌ దేవరకొండ, రష్మిక మందన్న నటించిన ‘గీత గోవిందం’ చిత్రం గత ఏడాది బిగ్గెస్ట్‌ హిట్‌ చిత్రాల్లో స్థానం దక్కించుకున్న విషయం తెల్సిందే. గీత గోవిందం చిత్ర యూత్‌ ఆడియన్స్‌ ను విపరీతంగా ఆకట్టుకుని నిర్మాతకు సంచలన లాభాలను తెచ్చి పెట్టింది. ఆ కారణంగానే హిందీలో ఈ చిత్రంను రీమేక్‌ చేయాలని భావిస్తున్నారు. ధడక్‌ చిత్రంలో హీరోగా నటించిన ఇషాన్‌ కట్టర్‌ రీమేక్‌ లో విజయ్‌ దేవరకొండ పాత్రను పోషించే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే విజయ్‌ దేవరకొండ అర్జున్‌ రెడ్డి మూవీ రీమేక్‌ అవుతున్న విషయం తెల్సిందే. తాజాగా ఈ చిత్రం కూడా రీమేక్‌ అయ్యే అవకాశాలున్నాయి.

తెలుగులో ‘గీత గోవిందం’ మ్యాజిక్‌ వర్కౌట్‌ అయ్యింది. విజయ్‌ దేవరకొండ వల్లే ఆ మూవీ సూపర్‌ హిట్‌ అయ్యిందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఒక సింపుల్‌ కథకు విజయ్‌ దేవరకొండ మ్యాజిక్‌ తోడ్పాటు అవ్వడం వల్లే సినిమా సూపర్‌ హిట్‌ సాధ్యం అయ్యింది. అయితే హిందీలో రీమేక్‌ అయితే మ్యాజిక్‌ వర్కౌట్‌ అయ్యేనా అనేది అనుమానమేనంటూ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. తెలుగులో అయినంత బ్లాక్‌ బస్టర్‌ కాకున్నా కూడా హిందీలో ఒక మోస్తరు విజయాన్నైనా దక్కించుకుంటుందని కూడా అంటున్నారు. మరి గీత గోవిందం రీమేక్‌ అసలు విషయంపై త్వరలోనే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.