Begin typing your search above and press return to search.

విజయ్ దేవరకొండ టార్గెట్ చిన్నదే!

By:  Tupaki Desk   |   12 Aug 2018 7:50 AM GMT
విజయ్ దేవరకొండ టార్గెట్ చిన్నదే!
X

టాలీవుడ్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ తాజా చిత్రం 'గీత గోవిందం' ఆగష్టు 15 న రిలీజ్ కానుంది. 'అర్జున్ రెడ్డి' సంచలన విజయం తర్వాత విజయ్ సోలో హీరో గా నటించిన సినిమా ఇదే కావడంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో - ట్రేడ్ వర్గాల్లో విపరీతమైన ఆసక్తి నెలకొంది. ఈ సినిమా కలెక్షన్స్ బట్టి విజయ్ క్రౌడ్ పుల్లింగ్ కెపాసిటీపై ఒక అంచనా కు వచ్చే అవకాశం ఉంది. మరి ఈ సినిమా బడ్జెట్ ఎంత? టార్గెట్ ఎంత?

'అర్జున్ రెడ్డి' కంటే ముందే ప్లాన్ చేసిన ప్రాజెక్ట్ 'గీత గోవిందం'. 'అర్జున్ రెడ్డి' తర్వాత విజయ్ కొత్తగా సాధించిన ఇమేజ్ కు తగ్గట్టు మార్పులు చేయడం - విజయ్ రెమ్యునరేషన్ కూడా పెంచడంతో ముందుగా అనుకున్న దానికంటే సినిమా బడ్జెట్ పెరిగింది. ఈ సినిమాకు మొత్తం రూ. 14 కోట్లు ఖర్చు అయిందట. ఈ సినిమా శాటిలైట్ - డిజిటల్ రైట్స్ - ఓవర్సీస్ అన్ని కలిపి 5 కోట్లు రికవర్ అయిందట. ఆ డీల్స్ ఎప్పుడో క్లోజ్ కావడంతో తక్కువ వచ్చింది కానీ అదే ఇప్పుడైతే నిర్మాతలకు ఎక్కువ వచ్చి ఉండేదనడంలో సందేహం లేదు.

సో.. మన గోవిందం టార్గెట్ ఇక 9 కోట్లు. రెండు తెలుగు రాష్ట్రాలు - కర్ణాటక కలెక్షన్స్ టార్గెట్ ఇది. సినిమాకు మంచి బజ్ ఉంది కాబట్టి ఇదేమీ కష్టం కాదు. థియేట్రికల్ రైట్స్ అమ్మితే ఈజీగానే టేబుల్ ప్రాఫిట్ వస్తుంది కానీ గీతా ఆర్ట్స్ వారు సొంతంగా రిలీజ్ చేస్తున్నారట. రష్మిక మందన్న ఈ సినిమాలో హీరోయిన్. గోపి సుందర్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి పరశురామ్ దర్శకుడు.