Begin typing your search above and press return to search.

సర్ ప్రైజ్ ఇవ్వబోతున్న ‘గీతాగోవిందం’

By:  Tupaki Desk   |   5 Aug 2018 10:34 AM GMT
సర్ ప్రైజ్ ఇవ్వబోతున్న ‘గీతాగోవిందం’
X
‘అర్జున్ రెడ్డి’ తర్వాత ఫుల్ క్రేజ్ సంపాదించుకున్న విజయ్ దేవరకొండ తాజాగా తీసిన ‘గీతాగోవిందం’ పైన గంపెడు ఆశలు పెంచుకున్నారు. ఈ సినిమా కూడా తన కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ అవుతుందని ఆశిస్తున్నాడు. అందులో భాగంగా సినిమాకు హైప్ తీసుకురావడానికి వినూత్న ప్రయోగానికి శ్రీకారం చుడుతున్నాడు.

పరుశురామ్ దర్శకత్వంలో అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు నిర్మిస్తున్న ‘గీతాగోవిందం’ మూవీ ఇటీవలే సెన్సార్ పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా కొన్ని సన్నివేశాల విషయంలో సెన్సార్ సభ్యులు అభ్యంతరం పెట్టడంతో కోత పెట్టారట. దాంతోపాటు సినిమా నిడివి ఎక్కువ కావడంతో పలు సీన్లను తీసేశారట.. ఇప్పుడు ఈ డిలేటెడ్ సీన్లను సినిమా రిలీజ్ కు ముందే యూట్యూబ్ లో విడుదల చేసి గట్టిగా ప్రచారం చేయాలని చిత్రం యూనిట్ ప్లాన్ చేసినట్టు సమాచారం. నేడో - రేపో ఈ సన్నివేశాలు యూట్యూబ్ లోకి కనిపించనున్నాయి.

తమిళంలో మొదట ఈ ఒరవడి మొదలైంది. తెలుగులో మాత్రం సినిమా హిట్ అయ్యాకే ఈ డిలేటెడ్ సీన్లను విడుదల చేస్తారు. ‘భరత్ అనే నేను గ్రాండ్ హిట్ అయ్యాక అందులోని డిలేటెడ్ సీన్లు ఎంత పాపులర్ అయ్యాయో తెలిసిందే.. కానీ ‘గీతాగోవిందం’ ఆ సీన్లను ముందే క్యాష్ చేసుకోవాలని సినిమా విడుదలకు ముందే రిలీజ్ చేస్తుండడం విశేషంగా చెప్పవచ్చు. మరి ఈ సీన్లు సినిమాపై ఎంతమేరకు ఆసక్తి పెంచుతాయనేది వేచి చూడాల్సిందే..