Begin typing your search above and press return to search.

గోల్డ్ కంటే గోవిందానికే ఎక్కువ కలెక్షన్స్!

By:  Tupaki Desk   |   20 Aug 2018 1:03 PM GMT
గోల్డ్ కంటే గోవిందానికే ఎక్కువ కలెక్షన్స్!
X

హిందీలో ఒక పాపులర్ కొటేషన్ ఉంది. ఊపర్ వాలా జబ్ భీ దేతా హై ఛపడ్ ఫాడ్ కె దేతా హై ( రఫ్ గా మీనింగ్ చెప్పుకుంటే 'దేవుడు ఇవ్వాలని డిసైడ్ అయితే మీరు ఆ వరాల వానలో తడిసి ముద్దవ్వాల్సిందే'). మీరు నాస్తికులయితే మాత్రం ఈ కొటేషన్ ని వెంటనే మైండ్ నుండి షిఫ్ట్ డిలీట్ కొట్టండి.. డైరెక్ట్ గా టాపిక్ లో కి వెళ్దాం. విజయ్ దేవరకొండ హార్డ్ వర్క్ కి తగిన ప్రతిఫలం అంటారో.. నాగర్ కర్నూల్ లో నక్కతోక తొక్కితే వచ్చిన లక్కంటారో... లేక దేవుడిస్తున్న వరాల వాన అనుకుంటారో.. ఏదైనా అనుకోండి. విజయ్ ఇప్పుడు ఒక హాట్ టాపిక్.

వరసగా బాక్స్ ఆఫీస్ హిట్లు.. పేరు వింటేనే పిచ్చెక్కి పోయే ఫ్యాన్స్.. ఆడియన్సే కాకుండా సెలబ్రిటీస్ అందరి దగ్గరనుండి ప్రశంసలు.. ఇక ఒక్కటేంటి.. మెగాస్టార్ చిరంజీవే స్వయంగా 'ఇండస్ట్రీ కి కొత్త స్టార్ వచ్చాడు అని చెప్పి గాడ్ బ్లెస్ యు విజయ్' అన్నాడంటే ఇక ఎవరి సర్టిఫికేట్ కావాలి? మరి విజయ్ హవా ఇక్కడే కాదు ఆస్ట్రేలియా లో కూడా సాగుతోంది. విజయ్ 'గీత గోవిందం' సినిమా కలెక్షన్స్ లు బాలీవుడ్ సినిమాల కంటే ఎక్కువగా ఉండడం విశేషం. అక్షయ్ కుమార్ సినిమా 'గోల్డ్'.. జాన్ అబ్రహం సినిమా 'సత్యమేవ జయతే' రెండూ సినిమాల వీకెండ్ కలెక్షన్స్ కలిపితే కూడా 'గీత గోవిందం' కలెక్షన్స్ ను దాటలేకపోయాయట. అక్షయ్ -జాన్ అబ్రహం సినిమాల జాయింట్ కలెక్షన్స్ 192 - 306 ఆస్ట్రేలియన్ డాలర్లయితే గీత గోవిందం సినిమా వీకెండ్ కలెక్షన్స్ 202 - 266 ఆస్ట్రేలియన్ డాలర్లు! ఒక్క ఆస్ట్రేలియాలో మాత్రమే కాదు. చాలా ఏరియాల్లో పరిస్థితి ఇలానే ఉందట.

ఈ విషయం ఇప్పుడు బాలీవుడ్ ట్రేడ్ సర్కిల్స్ లో కూడా ఒక హాట్ టాపిక్ అయిందట. అసలే తెలుగు సినిమాలు ఈమధ్య హిందీ సినిమాలకు చుక్కలు చూపిస్తున్నాయి. ఇప్పటికే తరణ్ ఆదర్శ్ లాంటి ట్రేడ్ విశ్లేషకులు టాలీవుడ్ సినిమాలను చూసి హిందీ ఫిలిం మేకర్స్ బుడ్డీ తెచ్చుకోవాలని... సారీ 'బుద్ధి' తెచుకోవాలని గడ్డి పెడుతున్నారు. ఈ సమయంలో విజయ్ సినిమా కూడా ఇలా రచ్చ చేయడం విశేషమే!