Begin typing your search above and press return to search.

బాలయ్యతో గీతా ఆర్ట్స్ మూవీ... ?

By:  Tupaki Desk   |   1 Nov 2021 12:30 AM GMT
బాలయ్యతో గీతా ఆర్ట్స్ మూవీ... ?
X
బాలయ్య టాప్ స్టార్. ఆయన వందకు పైగా మూవీస్ చేశారు. అయితే బాలయ్య ఎపుడూ కొత్త బ్యానర్లలోనే మూవీస్ చేశారు. టాలీవుడ్ లో పెరు పడ్డ ప్రొడక్షన్ హౌస్ లతో బాలయ్య పెద్దగా కలిసింది లేదు. కెరీర్ ప్రారంభంలో సురేష్ ప్రొడక్షస్ లో రెండు సినిమాలు చేశారు. ఇక తన సొంత నిర్మాణ సంస్థ రామక్రిష్ణ సినీ స్టూడియోస్ లో కూడా మూవీస్ చేశారు. అయితే బాలయ్య చేయని ప్రముఖ నిర్మాణ సంస్థలలో గీతా ఆర్ట్స్ కూడా ఉంది. గీతా ఆర్ట్స్ అంటే మెగా స్టార్ కే పరిమితం అన్న పేరు కూడా ఒక దశలో వచ్చింది. నిజానికి 1970లో మొదలైన గీతా ఆర్ట్స్ మురళీ మోహన్, చలం లాంటి హీరోలతో సినిమాలు చేసింది. చిరంజీవి అల్లు వారి అల్లుడు అయ్యాక గీతా ఆర్ట్స్ ఆయన సొంత బ్యానర్ అయిపోయింది.

ఇవన్నీ ఇలా ఉంటే చిరంజీవి రీ ఎంట్రీ తరువాత వరసగా కొణిదెలా ప్రొడక్షన్స్ లోనే మూవీస్ చేస్తున్నారు. అది కుమారుడు రామ్ చరణ్ ఓన్ బ్యానర్. ఇక ఇపుడు కొన్ని బయట బ్యానర్లకి కూడా సినిమాలు కమిట్ అయినా కూడా అందులో కూడా కొణిదెలా ప్రొడక్షన్స్ నిర్మాణ భాగాస్వామ్యం ఉంది. చిత్రమేంటి అంటే గీతా ఆర్ట్స్ లో చిరంజీవి మూవీ చేసి చాలా కాలం అయింది. మరో వైపు అల్లు అర్జున్ అల్లు వారి ఫ్యామిలీకి అంది వచ్చిన హీరో అయ్యాడు. ఇంకో వైపు గీతా ఆర్ట్స్ బ్యానర్ టూ అని పెట్టి కొత్త హీరోలతో మినిమం రేంజి హీరోలతో సినిమాలు చేస్తున్నారు.

ఇపుడు అహా అంటూ ఓటీటీ ఫ్లాట్ ఫారాన్ని కూడా ఏర్పాటు చేసి అల్లు అరవింద్ దూసుకుపోతున్నారు. ఈ నేపధ్యంలో నందమూరి బాలక్రిష్ణతో కొత్త బంధం కలిపారు. ఆహా ద్వారా టాక్ షో తో తొలిసారిగా బాలయ్య హోస్ట్ అవతారం ఎత్తారు. బాలయ్య, అల్లు అరవింద్ మధ్య ఎంత బాండింగ్ ఉందో ఆహా టాక్ షో ఫస్ట్ ప్రమోలో చెప్పకనే చెప్పేశారు. ఎన్టీయార్ అల్లు రామలింగయ్య కాలం నుంచి ఈ రెండు కుటుంబాలు చాలా అనుబంధంగా ఉంటూ వస్తున్నాయి. మరి ఇంతలా బంధం ఉన్న తరువాత అది కూడా టాక్ షో ద్వారా మరింత దగ్గర అయ్యాక బాలయ్యతో గీతా ఆర్ట్స్ బ్యానర్ మీద మూవీ కూడా తీస్తారా అన్న చర్చ అయితే వస్తోంది.

బాలయ్యతో గీతా ఆర్ట్స్ మూవీ సినిమా కనుక చేస్తే అది అద్భుతమే అవుతుంది. పైగా మెగాస్టార్ చిరంజీవి సమకాలికుడు అయిన బాలయ్యతో మెగా ఫ్యామిలీకి ఓన్ బ్యానర్ లాంటి గీతా ఆర్ట్స్ తో బాలయ్య అంటే అటు మెగా ఇటు నందమూరి ఫ్యాన్స్ షాక్ లాంటి వార్త విన్నట్లే. అయినా ఆహా టాక్ షో దాకా వచ్చిన బాలయ్య గీతా ఆర్ట్స్ లో నటించడంలో వింత ఏముంది. అది జరిగినా జరుగుతుంది. అయితే ఆ హాట్ అండ్ స్వీట్ న్యూస్ కోసం మాత్రం ఫ్యాన్స్ కాస్తా వెయిట్ చేయడమే.