Begin typing your search above and press return to search.

`గీతా ఆర్ట్స్` స్పీడ్ మాములుగా లేదే!

By:  Tupaki Desk   |   6 Nov 2021 7:20 AM GMT
`గీతా ఆర్ట్స్` స్పీడ్ మాములుగా లేదే!
X
మెగా నిర్మాత అల్లు అర‌వింద్ స్థాపించిన గీతా ఆర్ట్స్ సంస్థ టాలీవుడ్ లో అగ్ర‌గామి సంస్థ‌గా ఎదిగిన వైనం గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. ఎన్నో విజ‌య‌వంత‌మైన చిత్రాల‌తో గీతా ఆర్స్ట్ ఓ బ్రాండ్ ని క్రియేట్ చేసుకుంది. ఆ సంస్థ‌కు తెలుగు చ‌ల‌న చిత్ర ప‌రిశ్ర‌మ‌లో ఎన్నో రికార్డులున్నాయి. అయితే ఇదే తీరున బాలీవుడ్ లోనూ రాణించాల‌ని గీతా ఆర్స్ట్ అక్క‌డా రెండు ద‌శాబ్ధాల క్రిత‌మే అడుగు పెట్టింది. `ప్ర‌తిబంద్` సినిమాతో గీతా ఆర్స్ట్ అక్క‌డా లాంచ్ అయింది. ఆ త‌ర్వాత `ది జెంటిల్ మెన్`.. `కున్ వారా`..`క్యా యేహీ ప్యార్ హై` వంటి సినిమాల్ని నిర్మించింది. కానీ అంత‌గా స‌క్సెస్ కాలేదు.

ఆ త‌ర్వాత పూర్తిగా హిందీ సినిమాల నిర్మాణానికే దూర‌మైంది. అయితే ఇప్పుడు సినిమా స్వ‌రూపం పూర్తిగా మారిపోయింది. పాన్ ఇండియా..పాన్ వ‌ర‌ల్డ్ అంటూ కార్పోరేట్ నిర్మాణ సంస్థ‌లు దూసుకుపోతున్నాయి. ఆ పోటీని త‌ట్టుకుని నిల‌బ‌డాలంటే పాపుల‌ర్ అయిన అన్ని భాష‌ల్లోనూ సినిమాలు నిర్మించాల్సిన ప‌రిస్థితులు ఏర్ప‌డుతున్నాయి. ఈ నేప‌థ్యంలో అల్లు అర‌వింద్ మ‌ళ్లీ బాలీవుడ్ ని టార్గెట్ చేసిన‌ట్లు క‌నిపిస్తోంది. ఇప్ప‌టికే ఆక్క‌డ ఓ రెండు సినిమాల్ని నిర్మిస్తూ అర‌వింద్ ప‌ర్ఫెక్ట్ ప్లానింగ్ తో దూసుకుపోతున్నారు. తెలుగులో విజ‌యం సాధించిన `జెర్సీ` చిత్రాన్ని బాలీవుడ్ లో అదే టైటిల్ తో రీమేక్ చేస్తున్నారు.

అలాగే `అల వైకుంఠ‌పుర‌ములో` చిత్రాన్ని `షెన్ జాదా` టైటిల్ తో రీమేక్ చేస్తున్నారు. తాజాగా ఈ సినిమా షూటింగ్ కూడా పూర్త‌యింది. ఈ రెండూ గాక మ‌రో మీడియం బ‌డ్జెట్ చిత్రాన్ని కూడా గీతా ఆర్స్ట్ నిర్మిస్తోంది. ఒకేసారి బ్యాక్ టూ బ్యాక్ హిందీలో సినిమాలు నిర్మించ‌డంతో గీతా ఆర్స్ట్ కి ఇదే మొద‌టిసారి. దీన్ని బ‌ట్టి అల్లు అర‌వింద్ బాలీవుడ్ నిర్మాణంపై ఎంత ఆస‌క్తిగా ఉన్నారో అర్థ‌మ‌వుతోంది. అలాగే ఆహా ఓటీటీ ప్రారంభించి దేశ వ్యాప్తంగాను పాపుల‌ర్ అవ్వ‌డానికి గ‌ట్టి ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. ఇక గీతా ఆర్స్ట్ కి అనుబంధంగా జీఏ-2 పిక్చ‌ర్స్ అనే మ‌రో సంస్థ‌ను స్థాపించి మీడియం బ‌డ్జెట్ చిత్రాల్ని నిర్మిస్తోన్న సంగ‌తి తెలిసిందే.