Begin typing your search above and press return to search.

ఐదేళ్ల పాపతో నరకం చూసొచ్చాను -గౌతమి

By:  Tupaki Desk   |   28 Aug 2015 7:16 PM IST
ఐదేళ్ల పాపతో నరకం చూసొచ్చాను -గౌతమి
X
దాదాపు 14 ఏళ్ల తర్వాత పాపనాశం (దృశ్యం రీమేక్‌) చిత్రంతో తమిళ ప్రేక్షకుల ముందుకు వచ్చారు గౌతమి. రీఎంట్రీని ఘనంగా చాటుకున్నారు. అయితే ఆ సినిమా తర్వాత వరుసగా సినిమాలు చేయడం లేదేంటి? అని ఎవరైనా ప్రశ్నిస్తే.. నేను ఒకేసారి ఒక పని మాత్రమే చేయగలను. కొందరు ఒకేసారి నాలుగైదు పనులు చేయగలమని చెబుతుంటారు. అలాంటివారంటే నాకు గౌరవమే కానీ, నేను మాత్రం అలా చేయలేను. ఒకసారి ఒక పని మాత్రమే చేస్తాను. ప్రస్తుతం నేను కమల్‌ హాసన్‌ తెరకెక్కించే సినిమాలన్నిటికీ కాస్ట్యూమ్‌ డిజైనర్‌ గా పనిచేస్తున్నా. సంసార జీవనాన్ని సాగిస్తూనే, నా వృత్తిని విజయవంతంగా కొనసాగిస్తున్నా అని చెప్పారు.

సినిమాల్లో నటించే అవకాశం ఉన్నా .. ఛాయిస్‌ నాదే. కుటుంబం ముఖ్యం. నా కూతురి ఆలనా పాలనా ముఖ్యం అనుకున్నా. అందుకే నటించలేదని గౌతమి చెప్పారు. స్థన క్యాన్సర్‌ వచ్చిన మాటని దాచి పెట్టాల్సిన పనేలేదు. అప్పటికి నాకు ఐదేళ్ల పాప. బ్రెస్ట్‌ క్యాన్సర్‌ అని తెలిసి నరకం అనుభవించా. కానీ ఆ టైమ్‌ లో కమల్‌ హాసన్‌ నన్ను ఎంతో ప్రేమగా చూసుకున్నారు. అమ్మా నాన్న ఉండి ఉంటే బాగా చూసుకునేవారు. కానీ నా ఇద్దరు ఆంటీలు, కమల్‌ నాతోనే ఉండి ఎంతో బాగా చూసుకున్నారు.. అంటూ గౌతమి వెళ్లడించారు.

శ్రుతిహాసన్‌, అక్షర తనకి కూతుళ్ల వంటి వారేనని గౌతమి ఈ సందర్భంగా చెప్పారు. క్యాన్సర్‌ పై అవేర్‌ నెస్‌ పెంచుతూ టీఆర్‌ ఎస్‌ ఎంపీ కల్వకుంట్ల కవిత నిర్మించిన 'లైఫ్‌ ఎగైన్‌' అనే సామాజిక చిత్రంలో గౌతమి నటించిన సంగతి తెలిసిందే.