Begin typing your search above and press return to search.

వారికంటే గౌతమ్‌ ఒక అడుగు ముందుకు

By:  Tupaki Desk   |   2 Jan 2019 5:06 AM GMT
వారికంటే గౌతమ్‌ ఒక అడుగు ముందుకు
X
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత బయోపిక్‌ అంటూ కోలీవుడ్‌ లో ప్రస్తుతం మూడు సినిమాలు తెరకెక్కుతున్న విషయం తెల్సిందే. అందులో ఒకటి నిత్యామీనన్‌ ప్రధాన పాత్రలో నటిస్తున్నది కాగా, మరో చిత్రంలో విద్యాబాలన్‌ అమ్మ పాత్రను పోషిస్తోంది. మరో సినిమాకు కూడా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈమూడు సినిమాలు కూడా కొన్ని రోజుల తేడాతోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. ఈ మూడు అమ్మ బయోపిక్‌ లు ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు కాస్త సమయం పట్టే అవకాశం ఉంది. అయితే ఈలోపు గౌతమ్‌ మీనన్‌ అమ్మ బయోపిక్‌ ను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు ప్లాన్‌ చేస్తున్నాడు.

కాపీరైట్‌ అనేది లేని అమ్మ బయోపిక్‌ ను ఎంతో మంది చేసేందుకు ముందుకు వస్తున్నారు. ఎవరి స్టైల్‌ లో వారు బయోపిక్‌ ను తెరకెక్కించేందుకు సిద్దం అవుతున్న ఈ సమయంలో తమిళ ప్రముఖ దర్శకుడు గౌతమ్‌ వాసుదేవ్‌ మీనన్‌ అమ్మ బయోపిక్‌ ను వెబ్‌ సిరీస్‌ ల రూపంలో తెరపైకి తీసుకు వచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు. సంక్రాంతికి ఫస్ట్‌ లుక్‌ టీజర్‌ ను కూడా విడుదల చేయబోతున్నట్లుగా ప్రకటించాడు.

తక్కువ బడ్జెట్‌ తో అమ్మ బయోపిక్‌ వెబ్‌ సిరీస్‌ ను తీసి ప్రేక్షకుల ముందుకు తీసుకు రావాలని గౌతమ్‌ భావిస్తున్నాడు. అమ్మ బయోపిక్‌ మూవీస్‌ వచ్చేందుకు కాస్త సమయం పట్టే అవకాశం ఉంది. ఈలోపులోనే గౌతమ్‌ మీనన్‌ వెబ్‌ సిరీస్‌ మూడు నాలుగు పార్ట్‌ లు విడుదలయ్యే అవకాశం ఉందని తమిళ సినీ వర్గాల్లో టాక్‌ వినిపిస్తుంది. మొదట వెబ్‌ సిరీస్‌ వస్తుంది కనుక తమిళ జనాలు చాలా ఆసక్తి కనబర్చే అవకాశం ఉంది. వెబ్‌ సిరీస్‌ విడుదలైన తర్వాత అమ్మ బయోపిక్‌ చిత్రాలపై అంతగా ప్రేక్షకుల్లో ఆసక్తి ఉండక పోవచ్చు అనే టాక్‌ కూడా వినిపిస్తుంది. మొత్తానికి గౌతమ్‌ మీనన్‌ వెబ్‌ సిరీస్‌ లను ప్లాన్‌ చేసి అమ్మ బయోపిక్‌ విషయంలో వారి కంటే ఒక అడుగు ముందు వేసినట్లయ్యింది.