Begin typing your search above and press return to search.

హీరోనే క్లైమాక్స్‌ చెబితే, సినిమానే ఆపేస్తా

By:  Tupaki Desk   |   16 Aug 2015 6:49 AM GMT
హీరోనే క్లైమాక్స్‌ చెబితే, సినిమానే ఆపేస్తా
X
గౌతమ్‌ మీనన్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ద్విభాషా చిత్రం 'కొరియర్‌ బోయ్‌ కళ్యాణ్‌'. ఈ సినిమా ఆలస్యానికి కారణం ఏంటో చెప్పారు గౌతమ్‌ మీనన్‌. అంతేకాదు ఇంకా బోలెడన్ని సంగతులు ముచ్చటించారిలా..

కొరియర్‌ బోయ్‌ కళ్యాణ్‌.. చిత్రం రెండు భాషల్లో తెరకెక్కింది. తెలుగులో నితిన్‌, తమిళ్‌ లో జై హీరోలుగా నటించారు. రెండు వెర్షన్లకు కథ ఒకటే అయినా క్యారెక్టరైజేషన్ల లో హీరో ఇమేజ్‌ ని బట్టి మార్పుచేర్పులు చేశాం. నితిన్‌ కి రొమాంటిక్‌ హీరో ఇమేజ్‌ ఉంది కాబట్టి ఇక్కడ రొమాంటిక్‌ సన్నివేశాల్ని ఎక్కువ తీసుకున్నా. జై కి కామెడీ హీరో అన్న పేరుంది కాబట్టి తమిళ్‌ లో కామెడీ ఎలిమెంట్స్‌ ని జోడించా

ఈ ప్రాజెక్టు ఆలస్యమవ్వడానికి కారణమేంటి? అని ప్రశ్నిస్తే .. తమిళ వెర్షన్‌ వల్లే ఆలస్యం. తెలుగు వెర్షన్‌ ఎప్పుడో పూర్తయింది. కానీ తమిళ్‌ లో ఆలస్యమైంది. అందుకే ఇంతకాలం పట్టిందని సమాధానమిచ్చారు. స్క్రిప్టు లో డిలే అయ్యిందా? అన్న ప్రశ్నకు అలాంటిదేం లేదు. సెట్స్‌ కెళ్లేప్పటికి 80శాతం స్క్రిప్టు తో రెడీగా ఉంటా. క్లయిమాక్స్‌ మాత్రం ఆ తర్వాతే రాసుకునే అలవాటు ఉంది. హీరో బాడీ లాంగ్వేజ్‌ పై ఓ అవగాహన వచ్చాక క్లయిమాక్స్‌ రాసుకుంటా.. అని చెప్పారు.

ఒకవేళ క్లయిమాక్స్‌ ఇలా ఉండాలి, అలా ఉండాలి.. అని హీరో సూచిస్తే ఏం చేస్తారు? అన్న ప్రశ్నకు.. ప్రాజెక్టు ఇంతటితో ఆపేస్తానని కూల్‌ గా చెప్పారు. అన్నట్టు కొరియర్‌ బోయ్‌ కళ్యాణ్‌ చిత్రాన్ని రెండు భాషల్లో నేనే రిలీజ్‌ చేస్తున్నానని గౌతమ్‌ మీనన్‌ చెప్పారు. ప్రేమ్‌ ఈ చిత్రానికి కథ అందించారు. కొరియర్‌ బోయ్‌ కళ్యాణ్‌ తెలుగులో సెప్టెంబర్‌ 11న రిలీజవుతోంది.రుద్రమదేవి వంటి భారీ హిస్టారికల్‌ సినిమా రిలీజైన వారానికి వస్తున్నాం. ఇదో లవ్‌ స్టోరి కాబట్టి యూత్‌ కి రిలీఫ్‌ గా ఉంటుందని చెప్పారు.

నాగచైతన్య చిత్రం గురించి మాట్లాడుతూ.. చైతన్య, శింబు ఇద్దరితో మరో ద్విభాషా చిత్రం చేస్తున్నా. తెలుగులో చైతన్య, తమిళ్‌ లో శింబు హీరోలుగా నటిస్తున్నారు. ఈ ఇద్దరితో ర్యాపో బావుందని, అందుకే ఇలా ప్లాన్‌ చేశానని చెప్పారు.