Begin typing your search above and press return to search.

ఆల్రెడీ మూడు పెండింగ్.. నాలుగోది తీస్తాడట!

By:  Tupaki Desk   |   18 Oct 2018 4:51 PM IST
ఆల్రెడీ మూడు పెండింగ్.. నాలుగోది తీస్తాడట!
X
సౌత్ లో ఉన్న టాలెంటెడ్ ఫిలింమేకర్స్ లో గౌతమ్ మీనన్ ఒకరు. ఫార్మాట్ స్టోరీల వెంటబడకుండా రియలిస్టిక్ టచ్ తో సినిమాలు చేసే గౌతమ్ కు అభిమానులు కూడా భారీగానే ఉన్నారు. కానీ ఈమధ్య అయన సినిమాల షూటింగ్ డిలే కావడం.. రిలీజ్ కాకుండా ఆగి పోవడం సాధారణమైపోయింది. అయినా కొత్త సినిమాలను ప్రకటించడం మాత్రం ఆపడం లేదు.

తాజాగా కోలీవుడ్ హీరో శింబు తో ఒక సినిమా చేసేందుకు రెడీ అవుతున్నాడట. గౌతమ్ అభిమానులేమో శింబు సినిమా సంగతి సరే గానీ ముందు రిలీజ్ కాకుండా పెండింగ్ లో ఉన్న సినిమాల సంగతి తేల్చమని కోరుతున్నారు. మరోవైపు శింబు అభిమానులు మాత్రం ఇప్పటికే గౌతమ్ తీసిన సినిమా సినిమాలు రిలీజ్ కావడం లేదు ఇక ఈ కొత్త సినిమా సంగతి ఏమౌతుందో అని టెన్షన్ పడుతున్నారు.

ఇంతకీ అ పెండింగ్ ఉన్న సినిమాలు ఏవని అడగరా? ఒకటేమో ధనుష్ హీరోగా నటించిన 'ఎన్ని నొక్కి పాయుం తోటా'. ఈ సినిమాలో రానా దగ్గుబాటి కూడా ఒక కీలక పాత్ర పోషించాడు. మరో సినిమా విక్రమ్ హీరోగా తెరకెక్కిన 'ధృవ నట్చత్తిరమ్'. ఈరెండు కాకుండా 'నరగశూరాన్' అనే సినిమాను నిర్మించాడు. ఈ సినిమాలో అరవింద్ స్వామి.. సందీప్ కిషన్ లు లీడ్ యాక్టర్స్. మరి వీటన్నిటికీ మోక్షం ఎప్పుడో గౌతమ వాసుదేవుడే చెప్పాలి..!