Begin typing your search above and press return to search.

గ‌ణ‌ప‌తి బొప్ప మోర్యా అన్న మ‌హేష్ కొడుకు

By:  Tupaki Desk   |   7 Sep 2016 2:04 PM GMT
గ‌ణ‌ప‌తి బొప్ప మోర్యా అన్న మ‌హేష్ కొడుకు
X
మ‌హేష్ కొడుకు గౌత‌మ్‌ కృష్ణ అప్పుడే గణ‌ప‌తి బొప్పా మోర్యా అంటూ సంద‌డి చేశాడు. త‌న ఇంట్లో ప్ర‌తిష్టించుకొన్న బుజ్జి గ‌ణ‌ప‌య్య‌ని నిమ‌జ్జ‌నం చేశాడు. త‌ల‌కి రిబ్బ‌న్ క‌ట్టి త‌న స్టాఫ్‌ తోనూ - స్నేహితుల‌తోనూ క‌లిసి సంద‌డి చేస్తూ బుజ్జి గ‌ణ‌ప‌య్య‌ని ఊరేగింపుగా నిమ‌జ్జ‌నానికి తీసుకెళ్లాడు గౌత‌మ్‌. హైద‌రాబాద్‌ లోని దుర్గం చెరువులో నిమ‌జ్జ‌న ఘ‌ట్టాన్ని పూర్తి చేశాడు. మ‌హేష్ ప్ర‌స్తుతం చెన్నైలో షూటింగ్‌ లో ఉన్నాడు. లేదంటే ఆయ‌న కూడా త‌న కొడుకుతోపాటే నిమ‌జ్జ‌నంలో పాల్గొనేవారని సూప‌ర్‌ స్టార్ ఫ్యాన్స్ అంటున్నారు.

గౌత‌మ్ పుట్టిన‌రోజును పుర‌స్కరించుకొని ఇటీవ‌లే ఫ్యామిలీ అంతా దుబాయ్ వెళ్లొచ్చారు. అక్క‌డ్నుంచి రాగానే వినాయ‌క చ‌వితి పండ‌గ సంద‌డిలో ప‌డిపోయారు. గౌత‌మ్ కోరిక మేర‌కు ఇంట్లో మ‌హేష్ బుజ్జి గ‌ణ‌ప‌య్య‌ని ప్ర‌తిష్టించి పూజ‌లు చేశారు. నిన్న‌టివ‌ర‌కు త‌న‌యుడితోపాటే గ‌ణేష్ పూజ‌ల్లో పాల్గొన్నారు మ‌హేష్‌.