Begin typing your search above and press return to search.

సన్నాఫ్ మహేష్ బాబు.. ఇప్పుడు టీనేజర్!

By:  Tupaki Desk   |   31 Aug 2019 9:46 AM GMT
సన్నాఫ్ మహేష్ బాబు.. ఇప్పుడు టీనేజర్!
X
ఈరోజు సూపర్ స్టార్ మహేష్ బాబు తనయుడు గౌతమ్ పుట్టిన రోజు. ఈ బర్త్ డే సాధారణమైనది కాదు.. ఒక ప్రత్యేకత ఉంది. ఎందుకంటే గౌతం పన్నెండేళ్ళు నిండి 13 వ ఏట అడుగుపెట్టాడు. అంటే గౌతమ్ టీనేజర్ అయినట్టే. టీనేజ్ 13 నుండి స్టార్ట్ అవుతుందని అందరికీ తెలిసిందే కదా.

ఇలాంటి అప్డేట్స్ ఏవైనా ఉన్నప్పుడు మహేష్ సతీమణి నమ్రత క్షణం ఆలస్యం చేయకుండా అభిమానులతో పంచుకుంటారు.. వారిని సంతోషపెడతారు. ఈసారి కూడా నమ్రత తన ట్రెండ్ ను కొనసాగిస్తూ ఇన్స్టా ఖాతా ద్వారా గౌతమ్ ఫోటోలు పోస్ట్ చేశారు. ఈ ఫోటోలకు "గడియారం 12 గంటలు కొత్తగానే మా అబ్బాయి 13 లో అడుగుపెట్టాడు... ఇప్పుడు తనో టీనేజర్. ఈ సమయంలో గౌతమ్ కు ఇష్టమైన చాకొలేట్ ను వాళ్ళ నాన్న మహేష్ తినిపించి ప్రేమగా ముద్దు పెట్టుకున్నపుడు గౌతమ్ ఎక్స్ ప్రెషన్స్ ఇవి. నా బేబీకి వెరీ హ్యాపీ బర్త్ డే. ప్రేమ.. సంతోషం ఎప్పుడూ నీతో ఉండాలని కోరుకుంటున్నా. ఐ లవ్ యూ Mr. గౌతమ్ ఘట్టమనేని." అంటూ ఓ పెద్ద క్యాప్షన్ ఇచ్చారు.

ఫోటోల్లో గౌతమ్ బ్లూ టీ షర్టు ధరించి తనదైన స్టైల్ లో అరనవ్వు నవ్వుతూ ఉన్నాడు. ఈ ఫోటోలకు. నెటిజన్లు ఫ్లాట్ అయిపోయారు. గౌతమ్ కు బర్త్ డే విషెస్ వెల్లువెత్తాయి. సూపర్ స్టార్ ఫ్యాన్స్ కూడా గౌతమ్ కు బర్త్ డే విషెస్ తెలుపుతూ ఫ్యూచర్ సూపర్ స్టార్ అని.. ప్రిన్స్ గౌతమ్ అని కామెంట్స్ పెట్టారు.