Begin typing your search above and press return to search.

మహేష్ పిల్లలు భలే క్యూట్!!

By:  Tupaki Desk   |   9 May 2017 4:22 PM GMT
మహేష్ పిల్లలు భలే క్యూట్!!
X
మహేష్ బాబు తన ఫ్యామిలీకి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తాడనే విషయం ప్రత్యేకించి చెప్పాల్సిన పని లేదు. సినిమాలను ఎంత సీరియస్ గా తీసుకుంటాడో.. ఫ్యామిలీ మెంబర్స్ తో ముఖ్యంగా పిల్లలతో టైం గడిపేందుకు అంతకంటే ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తాడు. అవసరం అయితే షూటింగ్ కి బ్రేక్ ఇచ్చి మరీ వెకేషన్స్ కి వెళ్లిపోవడం సూపర్ స్టార్ అలవాటే.

ప్రస్తుతం అందరికీ సమ్మర్ హాలిడేస్. మురుగదాస్ మూవీ కంప్లీట్ చేస్తూనే మధ్యలో పిల్లలతో కలిసి సమ్మర్ వెకేషన్ కూడా వెళ్లొచ్చాడు మహేష్. లండన్ టూర్ పూర్తి చేసిన మహేష్ అండ్ నమ్రత.. అక్కడ తమ కజిన్స్ ఇంట్లో గడిపారు. తమ పిల్లల క్యూట్ ఫోటోలను షేర్ చేయడం.. నమ్రతా మహేష్ కు అలవాటు. మహేష్ కూడా మధ్యమధ్యలో ఇలా ముద్దులొలికే తమ పిల్లల ఫోటోలను నెట్ లో పెడుతూ ఉంటాడు. అభిమానులకు ఆనందం పంచుతూ ఉంటాడు. తమ ఆనందాన్ని ఫ్యాన్స్ తో పంచుకోవడంలో మహేష్ అండ్ నమ్రతలకు మంచి ట్రాక్ రికార్డే ఉంది.

రీసెంట్ గా మహేష్ తన భార్యా పిల్లలతో కలిసి లండన్ వెళ్లినప్పటి ఫోటోలే ఇవి. మహేష్ కొడుకు గౌతమ్.. కూతురు సితారలు ఎంత ముద్దుగా ఉన్నారో కదా. ఇప్పుడీ ఫోటోలు ఆన్ లైన్ లో తెగ హల్ చల్ చేస్తున్నాయి. సూపర్ స్టార్ అభిమానుల మొబైల్స్ లో వాల్ పేపర్స్ గాను.. స్క్రీన్ సేవర్స్ గాను మారిపోతున్నాయి.