Begin typing your search above and press return to search.

మహేష్ పిల్లల రియాక్షన్ తెలిసింది

By:  Tupaki Desk   |   18 May 2019 11:40 AM IST
మహేష్ పిల్లల రియాక్షన్ తెలిసింది
X
బాక్స్ ఆఫీస్ వద్ద సమ్మర్ వన్ అండ్ ఓన్లీ ఆప్షన్ గా నిలుస్తున్న మహర్షి ఏ రేంజ్ బ్లాక్ బస్టరో తెలియాలంటే ఫైనల్ రన్ పూర్తవ్వాలి. కాని మహేష్ ఏ మాత్రం తగ్గకుండా కెరీర్లోనే మొదటిసారి దేనికీ చేయనంత అగ్రెసివ్ ప్రమోషన్ లో యాక్టివ్ గా పాల్గొంటున్నాడు. రెస్ట్ లేకుండా నాన్ స్టాప్ గా పబ్లిసిటీ ప్రోగ్రాంస్ లో భాగమవుతున్నాడు.

ఇదిలా ఉండగా రైతులు అభిమానులు ఇంతగా మెచ్చిన మహర్షి స్వయానా మహేష్ పిల్లలు గౌతం సితారలకు ఎలా అనిపించింది అనే సందేహం రావడం సహజం. దానికి స్వయానా ప్రిన్స్ సమాధానం ఇచ్చాడు. ఇందులో వ్యవసాయం అనే కాన్సెప్ట్ కి ఇద్దరూ బాగా కనెక్ట్ అయ్యారట

సినిమా అయ్యాక సితార కళ్ళలో నీళ్ళు కనిపించాయని గౌతం గట్టిగా కౌగిలించుకున్నాడని వాళ్ళ సంతోషాన్ని చూసాక తన నమ్మకం రెట్టింపు అయ్యిందని చెప్పాడు. అంతే కాదు రెండేళ్ళ క్రితం మహర్షి చేశాక ఇప్పటికి తన ఆలోచన ధోరణిలో మార్పు వచ్చిందని మూలాలు తెలుసుకునే ఆసక్తితో పాటు ఏడాదికి ఒకసారైనా పల్లెటూరికి వెళ్ళాలన్న కాంక్ష రగిలించిందని చెప్పాడు.

మొత్తానికి తన అభిమానుల్లోనే కాక తనలోనూ మార్పును తెచ్చిన మహర్షి పట్ల మహేష్ ఎగ్జైట్ మెంట్ కొనసాగుతూనే ఉంది. సీడెడ్ తో పాటు ఓవర్సీస్ లో రికవరీ చాలా స్లోగా ఉంది. ఇది పికప్ అవుతుందనే నమ్మకంతో ఉంది టీం. ఇంకొద్ది రోజుల్లో యుకె కు వెళ్తున్న మహేష్ వీలైనంత ప్రమోషన్ చేసేసి ఆ తర్వాత హాలిడే ప్లస్ వరల్డ్ కప్ అక్కడే ఎంజాయ్ చేస్తాడు .