Begin typing your search above and press return to search.

'మెగా' క్లాష్‌ ఎవాయిడ్ చేసిన నటసింహం

By:  Tupaki Desk   |   6 Dec 2016 3:59 PM GMT
మెగా క్లాష్‌ ఎవాయిడ్ చేసిన నటసింహం
X
డిసెంబర్ 9. అదే రోజున రామ్ చరణ్‌ 'ధృవ' విడుదలవుతోంది. అదీ చాలదన్నట్లు మెగాస్టార్ చిరంజీవి 150వ సినిమా 'ఖైదీ నెం150' టీజర్ ను కూడా ధియేటర్లలో విడుదల చేస్తున్నారు. అయితే అదే రోజున నందమూరి బాలకృష్ణ 100వ సినిమా గౌతమీపుత్ర శాతకర్ణి ట్రైలర్ను కూడా లాంచ్ చేయాలని డిసైడ్ చేసుకున్నారు. అందుకే మెగా-నందమూరి క్లాష్‌ చూడబోతున్నారంటూ సోషల్ మీడియాల్లో సినిమా లవర్లు అందరూ ఊదరగొట్టేశారు.

నిజానికి సంక్రాంతి నాడు కూడా.. చిరంజీవి అండ్ బాలయ్యల సినిమాలు వేర్వేరు డేట్లలోనే విడుదలవుతున్నాయి. మరి ఇప్పుడు ట్రైలర్ మాత్రం ఒకే రోజున విడుదల చేసి.. ఒకరి సినిమా అప్పీల్ ను ఒకరు తగ్గించుకోవడం ఎందుకు? ఈ విషయం అభిమానులకు అర్దమైనా అవ్వకపోయినా కూడా.. ఎలాగో ధృవ రిలీజవుతోంది కాబట్టి.. శాతకర్ణి ట్రైలర్ ను పోస్టుపోన్ చేస్తే తప్పేంలేదని అన్నాడట బాలయ్య. పైగా ఈ 100వ సినిమాను ట్రైలర్ ను 100 ధియేటర్లలో కూడా లాంచ్ చేయాలని ప్లాన్ చేశారు. మరి ధృవ రిలీజ్ రోజున అది కూడా కాస్త కష్టమే. అందుకే శాతకర్ణి ట్రైలర్ లాంచ్ ఈవెంటును పోస్టుపోన్ చేసి.. మెగా క్లాష్‌ ఎవాయిడ్ చేశారు.

అసలు మన సీనియర్ హీరోలకు ఉన్న ఆ సెన్సిబిలిటీ రేంజే వేరబ్బా!!

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/