Begin typing your search above and press return to search.

బెనిఫిట్ షోలు.. సస్పెన్స్ సస్పెన్స్

By:  Tupaki Desk   |   7 Jan 2017 9:37 AM GMT
బెనిఫిట్ షోలు.. సస్పెన్స్ సస్పెన్స్
X
టాలీవుడ్లో పెద్ద సినిమాలు వస్తున్నాయంటే బెనిఫిట్ షోల హంగామా ఉండాల్సిందే. రిలీజ్ ముందు రోజు అర్ధరాత్రి నుంచి తెల్లవాజామున లోపు బెనిఫిట్ షోలు పడిపోతుంటాయి. ఎంత ముందుగా షో వేస్తే.. టికెట్ రేటు ఎంతగా పలికితే ఆ హీరోకు అంత రేంజ్ ఉన్నట్లన్నమాట. ఐతే గత ఏడాది వేసవికి తెలంగాణలో బెనిఫిట్ షోలు రద్దు చేస్తూ ఉత్తర్వులిచ్చారు. కొన్నాళ్ల పాటు ఆంక్షలు కొనసాగాయి. కానీ తర్వాత ‘జనతా గ్యారేజ్’ సినిమా సమయానికి సడలింపు వచ్చింది. ఆ సినిమాకు తెల్లవారుజామున 3 గంటలకే షోలు పడ్డాయి. దాని తర్వాత వచ్చిన పెద్ద సినిమా ‘ధృవ’. ఈ చిత్రానికి నిర్మాత అల్లు అరవిందే బెనిఫిట్ షోలు వద్దనేశాడు. దీంతో మామూలుగా ఉదయం షోలతో సినిమా మొదలైంది.

ఇప్పుడు సంక్రాంతి సినిమాలు భారీ అంచనాల మధ్య రిలీజవుతున్నాయి. వీటికి బెనిఫిట్ షోలు ఉంటాయా లేవా అని అభిమానులు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ లోని కొన్ని నగరాల్లో బెనిఫిట్ షోలకు ఇబ్బందేమీ లేదు. అక్కడ ఎప్పుడూ పర్మిషన్లకు ఇబ్బందేమీ లేదు. ఐతే హైదరాబాద్ సహా తెలంగాణ నగరాల సంగతే తేలాల్సి ఉంది. ‘ధృవ’కు బెనిఫిట్ షోలు వద్దన్న అరవింద్.. ‘ఖైదీ నెంబర్ 150’కి మాత్రం గ్రీన్ సిగ్నల్ ఇస్తారా అనేది సందేహం. ఈ విషయంలో నందమూరి క్యాంప్ ఫీలింగ్ ఏంటో తెలియదు. బెనిఫిట్ షోల వల్ల డివైడ్ టాక్ పెరుగుతోందని.. టికెట్ల రేట్లు ఇష్టానుసారం పెట్టి అభిమానుల్ని దోచుకునే ప్రయత్నం జరుగుతోందని ఇండస్ట్రీలో ఈ మధ్య డిస్కషన్ నడుస్తోంది. ఈ నేపథ్యంలో సంక్రాంతి సినిమాలకు కూడా బెనిఫిట్ షోలు రద్దు చేసి ఉదయం నుంచే షోలు వేయాలని చర్చలు జరుగుతున్నాయి. ఒకటి రెండు రోజుల్లో దీనిపై క్లారిటీ రావచ్చు.


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/