Begin typing your search above and press return to search.
ట్యాలెంటెడ్ డైరెక్టర్ రాంగ్ స్టెప్స్.. కెరీర్ ఖతమేనా?
By: Tupaki Desk | 25 April 2021 2:00 PM ISTసినిమా ఇండస్ట్రీలో చిన్న తప్పుడు నిర్ణయం పెద్ద పరిణామాలకు దారి తీస్తుంది అనే విషయం గతంలో పలువురి విషయంలో నిరూపితం అయ్యింది. ఇప్పుడు అదే విషయం ప్రముఖ దర్శకుడు సౌత్ సినీ అభిమానుల మనసులు దోచుకున్న సినిమాలను తెరకెక్కించిన గౌతమ్ వాసుదేవ్ మీనన్ కు జరిగింది. దర్శకుడిగా మంచి ఫామ్ లో ఉన్న సమయంలో నిర్మాణంలో అడుగు పెట్టాడు. నిర్మాతగా పూర్తి బాధ్యతలు తీసుకుని మరో వైపు దర్శకుడిగా సినిమాలు చేయడం అంటే కాస్త రిస్క్ తో కూడుకున్న విషయం. ఆయన రెండు పడవల ప్రయాణం మొదలు పెట్టడం ఆయన కెరీర్ లో అతి పెద్ద తప్పుడు నిర్ణయం అంటూ సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
దర్శకుడిగా వరుసగా పెద్ద సినిమాలు చేస్తున్న సమయంలో నిర్మాతగా గౌతమ్ మారి సినిమాలను నిర్మించడం మొదలు పెట్టాడు. గౌతమ్ మీనన్ నిర్మాణ సంస్థలో వచ్చిన సినిమాలు కమర్షియల్ గా నిరాశ పర్చాయి. ఇక ఒకటి రెండు సినిమాలు మద్యలో ఆగిపోయాయి. అలా నిర్మాణ సంస్థ ఆర్థిక సంక్షోభంలో చికుక్కున్నట్లయ్యింది. ఆర్థికంగా ఇబ్బందులు ఉన్న ఈ సమయంలో ఆయన దర్శకత్వంపై శ్రద్ద పెట్టలేక పోతున్నట్లుగా అనిపిస్తుంది. దర్శకుడిగా గౌతమ్ ఒక మంచి ట్యాలెంటెడ్ డైరెక్టర్ అయినా కూడా ఆయన విషయంలో ఇప్పుడు హీరోలు నమ్మకం కోల్పోయారు.
స్టార్ హీరోలు మొహం చాటేస్తున్న ఈ సమయంలో గౌతమ్ మరో కొత్త మార్గంను ఎంచుకున్నాడు. దర్శకుడిగా నిర్మాతగా ప్రయాణం కొనసాగించిన ఈ దర్శకుడు నటుడిగా కొత్త ఇన్నింగ్స్ ను మొదలు పెట్టాడు. నటుడిగా గౌతమ్ ను చూడాలని ఏ ఒక్కరు అనుకోవడం లేదు. ఆయన నుండి మళ్లీ మంచి సినిమాలను ప్రేక్షకులు ఆశిస్తున్నారు. ఇప్పటికి అయినా గౌతమ్ మీనన్ తన అభిమానులు కోరుకుంటున్నట్లుగా ఒక చక్కని ఫీల్ గుడ్ లవ్ స్టోరీతో సినిమా చేయాలని ఇండస్ట్రీ వర్గాల వారు కూడా సూచిస్తున్నారు. కాని ఆయన మాత్రం దర్శకత్వం పై దృష్టి పెట్టే ఉద్దేశ్యంతో లేరు. ఆయన వేసిన రాంగ్ స్టెప్స్ తో మొత్తం కెరీర్ ఖతమయ్యే పరిస్థితి వచ్చిందని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.