Begin typing your search above and press return to search.

గౌతమ్-సితార‌.. దీపాల‌ సాంప్ర‌దాయం

By:  Tupaki Desk   |   30 Oct 2019 6:53 AM GMT
గౌతమ్-సితార‌.. దీపాల‌ సాంప్ర‌దాయం
X
దీపావ‌ళి వ‌చ్చి వెళ్లినా ఆ కాంతులు ఇంకా లోగిళ్ల‌నుంచి పోలేదు. సెల‌బ్రిటీల ఇంట ఇంకా ట‌పాసుల మోత మోగుతూనే ఉంది. దీపావ‌ళి రోజు మెగా కాంపౌండ్ .. అల్లు కాంపౌండ్.. ఘ‌ట్ట‌మ‌నేని కాంపౌండ్ సంబ‌రాల గురించి ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగింది. సైరా స‌క్సెస్ తో కొణిదెల కాంపౌండ్ లో సంబ‌రాలు మిన్నంటాయి. బ‌న్ని-స్నేహారెడ్డి కిడ్స్ తో దీపావ‌ళిని స్పెష‌ల్ గా జ‌రుపుకున్న ఫోటోలు వైర‌ల్ అయ్యాయి.

ఇక ఘ‌ట్ట‌మ‌నేని ఇంట సంబ‌రాల‌కు సంబంధించి ఒక్కో ఫోటో అంత‌ర్జాలంలోకి రివీల‌వుతున్నాయి. అందులో భాగంగా ఇప్ప‌టికే ప‌లు ఫోటోలు బ‌య‌ట‌కు వ‌చ్చాయి. తాజా ఫోటోల్లో సాంప్ర‌దాయం మైమ‌రిపించింది. భావు బీజ్ అనే సాంప్ర‌దాయానికి సంబంధించిన ఆ ఫోటోలు ఫ్యాన్స్ ని ఆక‌ట్టుకుంటున్నాయి. అన్నా చెల్లెళ్లు గౌత‌మ్- సితార ట్రెడిష‌న‌ల్ దుస్తుల్లో క్యూట్ గా క‌నిపించారు. అన్న‌కు బొట్టు పెడుతూ క్యూట్ సితార సంద‌డి ఆక‌ట్టుకుంది.

తెలంగాణ‌లో అన్నా చెల్లెళ్ల మ‌ధ్య‌ హార‌తి క‌ల్చ‌ర్.. కొత్త బ‌ట్ట‌లు తొడుక్కుని ఇంటిల్లిపాదీ సంద‌డిగా ఉండ‌డం .. ట‌పాసులు కాల్చ‌డం వ‌గైరా ఉంటాయి. ఇక ఆంధ్రా ప్రాంతంలో దీపాల పండ‌గ రోజు ఇల్లంతా ధేధీప్య‌మానంగా అలంక‌రించుకుని ల‌క్ష్మీదేవికి పూజ‌లు పున‌స్కారాల‌తో పాటుగా స్వీట్లు పంచుకోవ‌డాలు ట‌పాసులు పేల్చ‌డం వ‌గైరా హ‌డావుడి ఉంటుంది. బంధుమిత్రులు.. చుట్టాలు ప‌క్కాల్ని ఓ చోట చేర్చే పండ‌గ‌గా దీపావ‌ళి ఆక‌ట్టుకుంటూనే ఉంది. తెలుగు లోగిళ్ల‌లో సాంప్ర‌దాయాన్ని నిల‌బెడుతున్న ఈ పండ‌గ‌లే అలంక‌ర‌ణ‌.