Begin typing your search above and press return to search.

అంబానీ ఇల్లు.. స్టార్‌ వైఫ్ డిజైనింగ్‌!

By:  Tupaki Desk   |   8 May 2019 1:30 AM GMT
అంబానీ ఇల్లు.. స్టార్‌ వైఫ్ డిజైనింగ్‌!
X
బాలీవుడ్ లో స్టార్ వైఫ్స్ యాక్టివిటీస్ గురించి తెలిసిందే. పార్టీలు.. సెల‌బ్రేష‌న్స్ అంటూ నిరంత‌రం జాలీగా టైమ్‌ స్పెండ్ చేసే ఫేజ్ 3 ప్ర‌పంచం పోక‌డ గురించి ర‌క‌ర‌కాల క‌థ‌నాలు వినిపిస్తూనే ఉంటాయి. ఈ బాప‌తు జ‌నంపై క‌ళాత్మ‌క చిత్రాల‌ ద‌ర్శ‌కుడు మ‌ధుర్ భండార్క‌ర్ ఇప్ప‌టికే `ఫేజ్ 3` అనే సినిమా తీశారు. మ‌రోసారి ఏకంగా స్టార్ వైఫ్స్ నేప‌థ్యాన్నే ఎంచుకుని సినిమా తీస్తున్న సంగ‌తి తెలిసిందే. అయితే స్టార్ వైఫ్స్ జ‌ల్సాల గురించి బ‌య‌టికి తెలిసినంత‌గా వాళ్ల‌లో ఉన్న ఇన్న‌ర్ ట్యాలెంట్ గురించి తెలిసింది త‌క్కువే.

మిలియ‌న్ ట్రిలియ‌న్ డాల‌ర్ బిజినెస్ సాగించే రంగుల ప్ర‌పంచంలో స్టార్ వైఫ్స్ సంపాద‌న‌లు కూడా ఆ రేంజులోనే ఉంటాయన్న‌ది కొద్దిమందికే తెలిసిన న‌గ్న‌స‌త్యం. ఒక్క కింగ్ ఖాన్ షారూక్ భార్యామ‌ణి గౌరీఖాన్ నేప‌థ్యాన్ని ప‌రిశీలిస్తే ఆవిడ టూమ‌చ్ కాస్ట్ లీ. షారూక్ హీరో కాక‌ముందే ఇండ‌స్ట్రీలో బెస్ట్ ఇంటీరియ‌ర్ డిజైన‌ర్ గా గౌరీ సుప‌రిచితం. షారూక్ కి హీరోగా లిఫ్ట్ ఇచ్చిన భార్య‌మణిగా ఆవిడ గురించి చెబుతారు. ముంబై ఇండ‌స్ట్రీలో బెస్ట్ సెల‌బ్రిటీల ఇళ్ల‌న్నిటికీ గౌరీఖాన్ ఇంటీరియ‌ర్ డిజైన‌ర్. కాస్ట్ లీగా.. హై ఎండ్ ఇంటీరియ‌ర్ ని రూపొందించ‌డంలో గౌరీ ప్ర‌త్యేక‌త‌ను ఎంతో గొప్ప‌గా చెబుతారు.

అదంతా స‌రే.. ప్ర‌స్తుతం గౌరీఖాన్ ఏ ఇంటికి డిజైన్ చేస్తున్నారు? అంటే .. వ‌ర‌ల్డ్ రిచెస్ట్ ఇండ‌స్ట్రియ‌లిస్ట్.. రిల‌య‌న్స్ అంబానీల `అంటిల్లా`కు ఇంటీరియ‌ర్ డిజైన్ చేయ‌నున్నార‌ని తెలుస్తోంది. ప్ర‌పంచంలోనే అత్యంత ఖ‌రీదైన భ‌వంతిగా పేరున్న అంటిల్లాకు ఇంటీరియ‌ర్ డిజైన్ అంటే కాంట్రాక్ట్ రేంజ్ ఎంత పెద్ద మొత్తంలో ఉంటుందో ఓసారి ఊహించుకోవ‌చ్చు. ఇటీవ‌లే ఆకాశ‌మంత పందిరి వేయాల్సిన ప‌నే లేకుండా ముఖేష్ అంబానీ త‌న కొడుకు పెళ్లిని.. డాట‌ర్ ఇషా పెళ్లిని అంటిల్లాలోనే జ‌రిపించారు. దాదాపు 27 అంత‌స్తుల ఇంద్ర‌భ‌వ‌నంలాంటి ఈ ఇంట్లో స‌ర్వ సౌక‌ర్యాలు అందుబాటులో ఉంటాయి. అయితే ఇందులో ఇంటీరియ‌ర్ ఇన్నాళ్లు డిజైన్ చేయ‌లేదా? అంటే న‌చ్చ‌క‌పోయినా ఎప్ప‌టిక‌ప్పుడు మార్చేస్తుంటారు క‌దా!!