Begin typing your search above and press return to search.

షారుఖ్ కూతురి ఫొటోలు వైరల్

By:  Tupaki Desk   |   11 Jun 2018 11:04 AM GMT
షారుఖ్ కూతురి ఫొటోలు వైరల్
X
షారుఖ్ ఖాన్ కూతురు సుహానా ఖాన్ రెండు మూడేళ్ల ముందు వరకు చిన్న పిల్లలాగే కనిపించేది. షారుఖ్ తో కలిసి అనేకసార్లు ఐపీఎల్ మ్యాచ్‌లు చూడటానికి స్టేడియాలకు వచ్చిన ఈ అమ్మాయి.. తండ్రి ఒళ్లో కూర్చుని మ్యాచ్ లు చూడటం జనాలకు ఇంకా గుర్తే. రెండేళ్ల ముందు వరకు కూడా చిన్న అమ్మాయే అనిపించిన సుహానాలో గత రెండేళ్లలో చాలా మార్పులొచ్చేశాయి. ఇప్పుడు చూస్తే సుహానా సరికొత్తగా కనిపిస్తోంది.

చాలామంది బాలీవుడ్ సెలబ్రెటీల టీనేజ్ పిల్లల్లాగే కొత్త హాట్ అవతారంలోకి మారిపోయి కుర్రాళ్ల దృష్టిని ఆకర్షిస్తోందీ అమ్మాయి. ఈ మధ్య ఆమెకు సంబంధించిన కొన్ని హాట్ ఫొటోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేశాయి. తాజాగా సుహానా మరోసారి హాట్ టాపిక్ అవుతోంది. తన కూతురితో కలిసి ఒక పార్టీలో పాల్గొన్న గౌరీ ఖాన్.. దానికి సంబంధించిన ఫొటోల్ని షేర్ చేసింది. అందులో హీరోయిన్లకు దీటుగా గ్లామర్ ఒలకబోస్తోంది సుహానా. అది చూసి సుహానాకు హీరోయిన్ లక్షణాలు వచ్చేశాయని.. ఇక ఈ అమ్మాయిని కథానాయికను చేసేయొచ్చని కామెంట్లు చేస్తున్నారు నెటిజన్లు. అదే సమయంలో సుహానాను తల్లిదండ్రులే చెడగొట్టేస్తున్నారన్న వ్యాఖ్యలు కూడా వినిపిస్తున్నాయి. షారుఖ్ ట్రెడిషనల్ ఫ్యాన్స్ ఈ ఫొటోలపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఏదైతేనేం.. ఈ ఫొటోలైతే వైరల్ అవుతున్నాయి.