Begin typing your search above and press return to search.

మొన్న జ్వాల.. ఇప్పుడు గౌహర్

By:  Tupaki Desk   |   23 Nov 2016 4:00 AM IST
మొన్న జ్వాల.. ఇప్పుడు గౌహర్
X
సినీ ఇండస్ట్రీలో ఏమున్నా లేకపోయినా అఫైర్స్.. లింకప్ రూమర్స్ మాత్రం సహజం. సౌత్ ఇండస్ట్రీ కాస్త ఈ విషయంలో పర్వాలేదు కానీ బాలీవుడ్లో మాత్రం యాక్టర్ అనే ట్యాగ్ ఉన్న ప్రతీ ఒక్కళ్లు లింకప్ వార్తల్లో నానుతుంటారు. ఆఫ్ కోర్స్ వాళ్లకి కావాల్సింది కూడా అదేలెండి. కనీసం ఈ రకంగా అయినా పబ్లిసిటీ వస్తుందిగా. ఇప్పుడు అలాంటి తరహా వార్తలతోనే న్యూస్ మేకరయ్యాడు హర్షవర్థన్ రానే.

హర్షవర్థన్ రానే పేరు ఎక్కడో విన్నట్టు అనిపిస్తుందా..? అవును హీరోగా అదృష్టాన్ని పరీక్షించుకుంటూ ఇటు టాలీవుడ్... అటు బాలీవుడ్ అంటూ చక్కర్లు కొట్టే తెలుగబ్బాయే ఈ హర్ష. తకిట తకిట నుంచి మొన్నటి అనామిక వరకూ చాలా సినిమాల్లో కనిపించినా సరైన బ్రేక్ రాలేదు. ఎట్ ఏ సేమ్ టైమ్ సనమ్ తెరీ కసమ్ అంటూ హిందీలో కూడా ట్రై చేశాడు. అక్కడి వాళ్లకి కూడా హర్ష ఎక్కలేదు. ఇక సినిమాల సంగతెలా ఉన్న హర్ష పేరు మాత్రం ఎప్పుడూ ఏదో ఒక అఫైర్ లో వినిపిస్తుంటుంది. మొన్నటిదాకా బ్యాడ్మింటన్ ప్లేయర్ గుత్తా జ్వాలతో హర్షపేరు విడదీయనంత గట్టిగా వినిపించింది. ఎక్కడ చూసినా జంటగా కనిపించే వాళ్లు. ఇప్పుడు జ్వాల బదులు ఐటమ్ గర్ల్ గౌహర్ ఖాన్ తో హర్షవర్థన్ పేరు కలిపి రాస్తున్నారు. ఇటు హర్ష కూడా నాకు గౌహరంటే ఇష్టమే కానీ మీరు అనుకున్నట్టు కాదంటున్నాడు. గౌహర్ సేల్ఫ్ మేడ్ అందుకే ఐ లైక్ హర్ అంటున్నాడు.

ఇంతకీ ఈ గౌహర్ ఎవరంటారా.. శంకర్ దాదా ఎంబీబీఎస్ లో నా పేరే కాంచనమాల అంటూ మెగాస్టార్ పక్కన చిందులేసిందే ఆ భామ. బిగ్ బాస్ సీజన్ సెవన్ విన్నర్ కూడా అయిన గౌహర్ చాలామందితో ఎఫైర్స్ నడిపింది. ఇప్పుడేమో లేదులేదంటూనే హర్ష గౌహర్ పేరు జపిస్తున్నాడు. మరి ఈ బంధమైనా నిలబడుతుందా? చూడాలి!!


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/