Begin typing your search above and press return to search.

వీడియోః రాయ్‌ లక్ష్మి 'గర్జన' ఇంట్రెస్టింగ్‌

By:  Tupaki Desk   |   16 Dec 2020 3:15 PM IST
వీడియోః రాయ్‌ లక్ష్మి గర్జన ఇంట్రెస్టింగ్‌
X
రాయ్‌ లక్ష్మి.. లక్ష్మి రాయ్‌ ఇలా పేరును అటు ఇటు.. ఇటు అటు మార్చుకున్న ముద్దుగుమ్మకు ఆశించిన స్థాయిలో సక్సెస్‌ రాలేదు. తెలుగులో పలు సినిమాల్లో చేసినా కూడా స్టార్‌ డం రాకపోవడంతో ఈమె జర్నీ తమిళ మలయాళ చిత్రాల వైపుకు వెళ్లింది. అక్కడ ఈ అమ్మడు ఆకట్టుకోవడంతో పాటు కొన్ని సక్సెస్‌ లను కూడా దక్కించుకుంది. దాంతో అక్కడ వరుసగా సినిమాల్లో ఆఫర్లు దక్కించుకుంటుంది. ఇటీవలే ఈమె బాలీవుడ్‌ లో కూడా ఎంట్రీ ఇచ్చిన విషయం తెల్సిందే. ఇక ప్రస్తుతం ఈమె చేస్తున్న సినిమా 'గర్జన'. ఈ సినిమా చాలా విభిన్నంగా ఆకట్టుకునే స్క్రీన్ ప్లేతో ఉంటుందని యూనిట్‌ సభ్యులు అంటున్నారు.

ఈ సినిమాలో రాయ్‌ లక్ష్మి ఒక పాపకు తల్లి పాత్రలో కనిపించబోతున్నట్లుగా తెలుస్తోంది. తమిళ నటుడు శ్రీకాంత్‌ కీలక పాత్రలో కనిపించనున్న ఈ సినిమాలో ఒక తల్లి పులితో తన కూతురు కోసం పోరాడే సన్నివేశాలు కీలకంగా ఉంటాయని అంటున్నారు. గర్జన సినిమా చిన్న టీజర్ ను విడుదల చేశారు. ఈ టీజర్‌ లో చూపించిన షాట్స్‌ మరియు విజువల్స్‌ సినిమాపై అంచనాలు భారీగా పెంచుతోంది. సస్పెన్స్‌ థ్రిల్లర్‌ సినిమాలను ఎక్కువగా ఇష్టపడే వారి కోసం ఈ సినిమా తప్పకుండా ఆకట్టుకుంటుందనే అభిప్రాయంను యూనిట్‌ సభ్యులు చెబుతున్నారు.