Begin typing your search above and press return to search.

గార్గి ఓటీటీ రిలీజ్.. అందులోనే!

By:  Tupaki Desk   |   16 July 2022 2:30 AM GMT
గార్గి ఓటీటీ రిలీజ్.. అందులోనే!
X
టాలెంటెడ్ హీరోయిన్ సాయి పల్లవి నటించిన విరాటపర్వం సినిమా బాక్సాఫీస్ వద్ద అనుకున్నంత స్థాయిలో సక్సెస్ కాకపోయినాప్పటికీ ఓటీటీ లో మాత్రం ఆ సినిమాకు మంచి గుర్తింపు లభించింది. అయితే ఇప్పుడు ఆమె గార్గి అనే సినిమాతో ప్రేక్షకుల ముందు రానుంది. ఈ సినిమాకు పెద్దగా హైట్ లేకపోయినప్పటికీ ఓవర్గం ప్రేక్షకుల ఫోకస్ అయితే పడింది. సాయి పల్లవిని ఇష్టపడేవారు ఈ ఎమోషనల్ సోషల్ డ్రామాను చూసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.

కానీ ప్రేక్షకుల సంఖ్య ఎంతవరకు పెరుగుతుందో చెప్పడం కష్టమే. ప్రస్తుతం ఆ సినిమాకు పోటీగా ది వారియర్ ఉంది. అంతే కాకుండా వాతావరణం కూడా అనుకూలించే అవకాశం లేదు కాబట్టి కలెక్షన్స్ కూడా అంతంత మాత్రమే వచ్చే ఛాన్స్ ఉంది.

కేవలం తెలుగులోనే కాకుండా తమిళ్ మలయాళం లో కూడా ఈ సినిమాను విడుదల చేశారు. తెలుగులో రానా తమిళంలో సూర్య ద్వారా ట్రైలర్స్ లాంచ్ చేయించిన సాయి పల్లవి ప్రమోషన్స్ విషయంలో అయితే సోలోగానే ముందుకు కొనసాగింది.

ఇక ఈ సినిమా ధియేటర్స్ లో అయితే పెద్దగా వర్కౌట్ అయ్యే అవకాశం లేదని తెలుస్తోంది. కానీ కంటెంట్కు తగ్గట్టుగా మాత్రం ఓటీటీ లో సక్సెస్ అయ్యే అవకాశం ఉంది. ఈ సినిమా ఓటీటీ హక్కులను సోనీ లీవ్ సొంతం చేసుకుంది.

ఇక థియేటర్లో విడుదలైన నాలుగు వారాల అనంతరం ఓటీటీ వచ్చే అవకాశం ఉంది. ఇక బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ తగ్గితే ఈ సినిమా కాస్త ముందుగా వచ్చిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు.

ఒక అపార్ట్మెంట్లో జరిగిన గ్యాంగ్ రేప్ లో అన్యాయంగా ఒక వాచ్మెన్ చిక్కుకపోతే ఆ తర్వాత అతని కూతురు ఏ విధంగా తండ్రిని బయటకు తీసుకువచ్చింది అనే పాత్రలో సాయి పల్లవి ఈ సినిమాలో నటించింది. ట్రైలర్లో ఎమోషనల్ కంటెంట్ బాగానే హైలెట్ చేసిన సాయి పల్లవి సినిమా మొత్తంలో కూడా అద్భుతమైన నటనను కనబరిచినట్లు చెబుతున్నారు. మరి సినిమా ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాలి.