Begin typing your search above and press return to search.

జయదేవ్.. నాలుగో సింహంగా కొత్త హీరో

By:  Tupaki Desk   |   30 March 2017 7:53 AM GMT
జయదేవ్.. నాలుగో సింహంగా కొత్త హీరో
X
దర్శకుడు జయంత్ సి పరాన్జీకి టాలీవుడ్ లో స్పెషల్ ప్లేస్ ఉంటుంది. విక్టరీ వెంకటేష్ కెరీర్ కి ఫుల్ టర్నింగ్ ఇచ్చిన ప్రేమించుకుందాం..రా.. చిత్రంతో అరంగేట్రం చేసిన ఈయన.. ఆ తర్వాత దాదాపు అనేక స్టార్ హీరోలతో చేశాడు. చిరంజీవితో బావగారు బాగున్నారా.. మహేష్ తో టక్కరిదొంగ.. ప్రభాస్ అరంగేట్ర చిత్రం ఈశ్వర్ వంటి సినిమాలతో పాటు.. చివరగా 2011లో పవన్ తో తీన్ మార్ రూపొందించాడు.

ఏపీ విద్యాశాఖా మంత్రి ఘంటా శ్రీనివాసరావు కొడుకు ఘంటా రవిని హీరోగా పరిచయం చేస్తూ.. ఓ చిత్రాన్ని రూపొందిస్తున్నాడు జయంత్ సి పరాన్జీ. గత డిసెంబర్ లో షూటింగ్ ప్రారంభమైన ఈ చిత్రానికి.. ఇప్పుడు టైటిల్ నిర్ణయించారు. జయదేవ్ అనే టైటిల్ తో పాటు.. నాలుగో సింహం అనే ట్యాగ్ లైన్ ఉన్న పోస్టర్ ను రిలీజ్ చేశారు. కొత్త హీరో ఘంటా రవి లుక్ రిలీజ్ చేయలేదు కానీ.. పోస్టర్ లో మాత్రం పోలీస్ గెటప్ లో చేతిలో గన్ పట్టుకున్న హీరోని.. సిల్హౌట్ రూపంలో చూపించారు.

మాళవిక హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీ షూటింగ్ ఇప్పటికే చాలావరకు పూర్తయిపోగా.. ఒక పాటను ఇంకా షూటింగ్ చేయాల్సి ఉంది. త్వరలో ఈ పాట చిత్రీకరణ కోసం స్విట్జర్లాండ్ వెళ్లబోతున్నారు యూనిట్. ఆ తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ కూడా ప్రారంభించేసి.. సమ్మర్ చివర్లో జయదేవ్ ను విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నారు దర్శక నిర్మాతలు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/