Begin typing your search above and press return to search.

'గంగూబాయి' వ‌ర్సెస్ 'వాలిమై' వార్ పీక్స్

By:  Tupaki Desk   |   6 Feb 2022 9:38 AM GMT
గంగూబాయి వ‌ర్సెస్ వాలిమై వార్ పీక్స్
X
సెకండ్ వేవ్ టెన్ష‌న్ థ‌ర్డ్ వేవ్ లో లేదు. ఇప్పుడు థ‌ర్డ్ వేవ్ త‌గ్గుముఖం ప‌ట్ట‌డంతో వాయిదా ప‌డ్డ చిత్రాల‌న్నీ ఒక్కొక్క‌టిగా రిలీజ్ తేదీలతో ముందుకొస్తున్నాయి. ప్ర‌భుత్వాలు 50 శాతం ఆక్యుపెన్సీ.. రాత్రిపూట క‌ర్ఫ్యూలు కూడా ఎత్తివేసే దిశ‌గా అడుగులు ప‌డుతున్నాయి. మ‌ళ్లీ ఎలాంటి వేరియంట్లు పుట్టుకొస్తాయో తెలియ‌ని ప‌రిస్థితులు ఉన్న నేప‌థ్యంలో వీలైనంత త్వ‌ర‌గా సినిమాల‌న్నీ రిలీజ్ అయ్యేలా నిర్మాత‌లు ప్లాన్ చేస్తున్నారు. దీంతో ఈసారి బాక్సాఫీస్ వ‌ద్ద పోటీ కూడా గ‌ట్టిగా ఉంటుంద‌న‌డంలో సందేహం లేదు.

తాజాగా బాలీవుడ్ చిత్రం `గుంగూబాయి క‌తియావాడి`..కోలీవుడ్ చిత్రం `వాలిమై` మ‌ధ్య బిగ్ వార్ షురూ అయింది. రెండు చిత్రాలు ఒక రోజు వ్య‌వ‌ధిలో రిలీజ్ కి రెడీ అవుతున్నాయి. `వాలిమై` ఫిబ్ర‌వ‌రి 24న త‌మిళ్ తో పాటు...తెలుగు..హిందీ భాష‌ల్లో పెద్ద ఎత్తున రిలీజ్ అవుతుంది. ఈ సినిమా నిర్మాణంలో బాలీవుడ్ నిర్మాత బోనీ క‌పూర్ కూడా పార్ట‌న‌ర్ కావ‌డంతో ఉత్త‌రాదిన పెద్ద‌ ఎత్తున రిలీజ్ చేస్తున్నారు. దీంతో భారీగా థియేట‌ర్లు దొరికే అవ‌కాశం ఉంది. అలాగే గంగూబాయి ఫిబ్ర‌వ‌రి 25న రిలీజ్ తేదీగా ఖ‌రారు చేసారు. సంజ‌య్ లీలా భ‌న్సాలీ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రంలో అలియా భ‌ట్ ప్ర‌ధాన పాత్ర పోషించింది. గంగూబాయి పాత్ర‌లో అలియా భ‌ట్ ఇర‌గ‌దీసింద‌నే టాక్ ట్రైల‌ర్ తోనే వ‌చ్చింది. దీంతో సినిమాపై భారీ అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి. గంగూబాయి పాత్ర‌లో అలియాభ‌ట్ ఆహార్యం సినిమాకి ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ నిలుస్తుందని ద‌ర్శ‌క‌నిర్మాత తెలిపారు.

ఇక అజిత్ హీరోగా తెర‌కెక్కిన `వాలిమై` యాక్ష‌న్ ట్రైల‌ర్ గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. నెలల క్రిత‌మై రిలీజ్ అయిన ఈ సినిమా ట్రైల‌ర్ సినిమాపై అంత‌కంత‌కు అంచనాల్ని పెంచేసేంది. దీంతో గంగూబాయికి ఉత్త‌రాదిన భారీ పోటీనిచ్చే చిత్రంగా వాలిమై నిలుస్తుంద‌ని టాక్ వినిపిస్తోంది. ఇటీవ‌లే రిలీజ్ అయిన `పుష్ప -ది రైజ్` బాలీవుడ్ లో అనూహ్య విజ‌యాన్ని సాధించిన నేప‌థ్యంలో `వాలిమై` అలాంటి సంచ‌ల‌నాలు న‌మోదు చేసే ఛాన్సెస్ క‌నిపిస్తున్నాయి. ఇందులో బాలీవుడ్ హీరోయిన్ హ్యూమా ఖురేషీ అజిత్ కి జోడీగి న‌టించ‌డం ఉత్త‌రాదిన సినిమాకి క‌లిసొచ్చే అద‌న‌పు అంశం. మ‌రి అంతిమ‌గా బాక్సాఫీస్ వ‌ద్ద‌ ఎవ‌రిది పై చేయి అన్న‌ది తేలాలంటే? ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే.