Begin typing your search above and press return to search.
''గంగూబాయి'' టీజర్: సెక్స్ వర్కర్ నుంచి కామతిపుర రాణిగా ఎదిగిన వైనం..!
By: Tupaki Desk | 24 Feb 2021 6:10 PM ISTబాలీవుడ్ బ్యూటీ ఆలియా భట్ ప్రధాన పాత్రలో ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కిస్తున్న సినిమా ''గంగూబాయి కతియావాడి''. హుస్సేన్ జైదీ రచించిన 'మాఫీయా క్వీన్స్ ఆఫ్ ముంబై' లోని ‘మేడమ్ ఆఫ్ కామతిపుర' ఆధారంగా ఈ సినిమా రూపొందుతోంది. ఇది బన్సాలీ దర్శకత్వం వహిస్తున్న 10వ సినిమా. ఇప్పటికే విడులైన 'గంగూబాయి' ప్రచార చిత్రాల్లో ఆలియా స్టన్నింగ్ లుక్ తో ఆకట్టుకుంది. నేడు సంజయ్ లీలా భన్సాలీ పుట్టినరోజు సందర్భంగా ఈ రిలీజ్ డేట్ అనౌన్స్ చేయడంతో పాటు టీజర్ ని కూడా వదిలారు.
'గంగూబాయి' కథ విషయానికొస్తే తన ప్రియుడితో గుజరాత్ నుంచి ముంబై పారిపోయి వచ్చిన గంగూబాయిని ప్రియుడు మోసం చేసి వేశ్యాగృహానికి అమ్మేస్తాడు. ఆ తర్వాత అక్కడి నుంచి బయటపడలేక, గంగుబాయి పరిస్థితులు తనకు అనుకూలంగా మార్చుకుని తానే స్వయంగా వేశ్యాగృహాలను నడిపే స్థాయికి చేరుకుంటుంది. అప్పటి ముంబై డాన్ లతో పరిచయాలు కలిగిఉండి ఆ ప్రాంతానికి రాణిగా 'మేడమ్ ఆఫ్ కామతిపుర'గా పిలువబడింది. అయితే ఆ తర్వాత కాలంలో సెక్స్ వర్కర్ల హక్కుల కోసం పోరాడి.. వారు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రభుత్వంతో మాట్లాడి పరిష్కారం చూపింది.
ఇప్పుడు అలాంటి బలమైన పాత్రలో అలియా కనిపించింది. టీజర్ చూస్తుంటే ఈ పాత్రను అలియా ఛాలెంజింగ్ గా తీసుకుని పోషించినట్లు అర్థం అవుతోంది. ఇందులో అలియా16 ఏళ్ల అమ్మాయి నుంచి వయసు మీద పడిన వృద్ధురాలి వరకు తన పాత్రలో వెరీయేషన్ చూపించనుంది. ఇక సంజయ్ లీలా భన్సాలీ మరోసారి మంచి స్టోరీతో తనదైన స్క్రీన్ ప్లే తో ఆడియన్స్ ని అలరించబోతున్నాడని తెలుస్తోంది. బాలీవుడ్ స్టార్స్ అజయ్ దేవగణ్ - ఇమ్రాన్ హష్మి - హ్యూమా ఖురేషి ఇందులో కీలక పాత్రల్లో నటించారని సమాచారం. ఈ చిత్రాన్ని భన్సాలీ ప్రొడక్షన్స్ మరియు పెన్ స్టూడియోస్ బ్యానర్స్ పై సంజయ్ లీలా భన్సాలీ - జయంతి లాల్ నిర్మిస్తున్నారు. 'గంగూబాయి కతియావాడి' చిత్రాన్ని జులై 30న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు.