Begin typing your search above and press return to search.

గంగూబాయి ఎమోష‌న్ కి నిండా క‌న్నీళ్లే..!

By:  Tupaki Desk   |   28 Jun 2021 4:30 AM GMT
గంగూబాయి ఎమోష‌న్ కి నిండా క‌న్నీళ్లే..!
X
ఆలియాభ‌ట్ ప్ర‌ధాన పాత్ర‌లో సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వం వహిస్తున్న `గంగూబాయి కతియావాడి` చిత్రీక‌ర‌ణ పూర్త‌యింది. 2019 డిసెంబర్ లో ప్రారంభమైన ఈ మూవీకి నేటితో గుమ్మ‌డి కాయ కొట్టేశారు. మహమ్మారి వ‌ల్ల చిత్రీక‌ర‌ణ ఆల‌స్య‌మైనా భ‌న్సాలీ ఎంతో ప‌ట్టుద‌ల‌గా షెడ్యూళ్ల‌ను పూర్తి చేసారు.

చిత్రీక‌ర‌ణ ముగిసిన అనంత‌రం అలియా భట్ ఎంతో ఎమోష‌న‌ల్ అయ్యారు. తాజాగా తన సోషల్ మీడియాలో భ‌న్సాలీ టీమ్ తో తన ఆనందకరమైన ప్రయాణం గురించి ఒక అందమైన నోట్ ను రాసారు. ``2019 డిసెంబర్ 8న గంగూబాయి షూటింగ్ ప్రారంభించాం. రెండేళ్ల‌ తరవాత సినిమాను పూర్తి చేశాం! ఈ చిత్రం సెట్ లో ఉండ‌గా రెండు లాక్ డౌన్ లు... రెండు తుఫానులను చూసింది. దర్శకుడు ..నేను మేకింగ్ సమయంలో కోవిడ్ భారిన ప‌డ్డాం..! టీమ్ ఎదుర్కొన్న ఇబ్బందులు అన్నీ కలిసి మరో చిత్రం అవుతుంది! అయితే అంతకన్నా మేం ప‌ని చేసిన‌ది బ్రహ్మాండంగా జీవితాన్ని మార్చే అనుభవం`` అని ఆలియా భట్ ఎమోష‌న‌ల్ నోట్ రిలీజ్ చేశారు.

భ‌న్సాలీ సార్ దర్శకత్వంలో న‌టించ‌డం నా జీవిత‌మంతా మ‌ర్చిపోలేని ఒక కల. కానీ ఈ రెండేళ్ళ ప్రయాణానికి ఏదైనా శ‌క్తి నన్ను సిద్ధం చేసి ఉంటుందని నేను అనుకోను .. నేను ఈ సెట్ నుండి బయటికి వెళుతున్నాను..! అంటూ ఎమోష‌న‌ల్ అయ్యారు. ``నేను మిమ్మ‌ల్ని ప్రేమిస్తున్నాను సార్! మీకు ధన్యవాదాలు .. మీలాంటి వేరొక‌రు నిజంగా ఎవరూ లేరు!`` అని ప్ర‌శంస‌లు కురిపించారు ఆలియా.

ఒక చిత్రీక‌ర‌ణ పూర్త‌యితే.. మ‌న‌లో కొంత భాగం దానితో ముగుస్తుంది! ఈ రోజు నేను నాలో కొంత భాగాన్ని కోల్పోయాను .. గంగూ ఐ లవ్ యు! మీరు తప్పిపోతారు. ఈ రెండు సంవత్సరాలుగా నా కుటుంబం .. స్నేహితులు ! మీరు లేకుండా ఏమీ సాధ్యం కాదు! అంద‌రినీ ప్రేమిస్తున్నాను అని లేఖ‌ను ముగించారు ఆలియా.

సంజయ్ లీలా భన్సాలీ - డాక్టర్ జయంతిలాల్ గడా (పెన్ స్టూడియోస్) నిర్మించిన గంగూబాయి కతియావాడి దేశంలో అత్యంత భారీగా థియేటర్లలో విడుదల కానుంది. చరిత్ర పుటలలో ముంబై కామటిపుర మేడమ్ గా పాపుల‌రైన గంగూబాయిపై ఆస‌క్తిక‌ర చిత్ర‌మిది. చిన్న వయస్సులోనే వ్యభిచారంలోకి నెట్టివేయబడిన బాలిక ఎదిగే క్ర‌మంలో జ‌రిగిన క‌థ ఇది. చాలా మంది క్రూరమైన గ్యాంగ్ స్ట‌ర్లకు క్లయింట్ గా అత్యంత ప్రభావవంతమైన లేడీ పింప్ (వ్య‌భిచార నిరోధ‌కురాలు)గా క‌నిపించ‌నుంది. ఇంత‌కుముందు రిలీజైన టీజ‌ర్ సంచ‌ల‌నం సృష్టించిన సంగ‌తి తెలిసిందే.