Begin typing your search above and press return to search.

ఇన్నాళ్లకు ఆయన టాలెంట్ వాడుకుంటున్నారు

By:  Tupaki Desk   |   21 Feb 2018 5:00 AM IST
ఇన్నాళ్లకు ఆయన టాలెంట్ వాడుకుంటున్నారు
X
పాతికేళ్ల కిందట వచ్చిన ‘లిటిల్ సోల్జర్స్’ తెలుగు సినిమా చరిత్రలో ఒక క్లాసిక్ లాగా నిలిచిపోయింది. పిల్లల సినిమా అంటే అదేదో అవార్డుల కోసమే అన్న అభిప్రాయాల్ని మార్చేసి.. జనరంజకంగా ఆ చిత్రాన్ని తీర్చిదిద్ది.. ఇప్పుడు చూసుకున్నా చాలా రిఫ్రెషింగ్ గా.. వినోదాత్మకంగా ఉండేలా ఆ చిత్రాన్ని తీర్చిదిద్దాడు దర్శక నిర్మాత గుణ్ణం గంగరాజు. ఆ తర్వాత నిర్మాతగా చంద్రశేఖర్ యేలేటి లాంటి ప్రతిభావంతుడిని దర్శకుడిగా పరిచయం చేసింది కూడా గంగరాజే. ‘ఐతే’.. ‘అనుకోకుండా ఒక రోజు’ లాంటి సినిమాలు గంగరాజు అభిరుచికి అద్దం పడతాయి. ఇక ఆయన ప్రొడక్షన్లో వచ్చిన ‘అమృతం’ సీరియల్ ఏ స్థాయిలో వినోదం పంచిందో కొత్తగా చెప్పాల్సిన పని లేదు.

ఐతే గంగరాజు గత కొన్నేళ్లుగా లైమ్ లైట్లో లేరు. లేక లేక ‘చందమామలో అమృతం’ సినిమా తీస్తే అది ఆయన్ని దారుణమైన దెబ్బ కొట్టింది. ఆ తర్వాత సినిమాలు మానేసి సైలెంటైపోయారు గంగరాజు. ఐతే ఇప్పుడు ఆయన కొత్త అవతారంలో మళ్లీ ప్రేక్షకుల్ని పలకరించబోతున్నారు. ‘ప్రేమ ఇష్క్ కాదల్’.. ‘సావిత్రి’ సినిమాల దర్శకుడు పవన్ సాధినేని.. కళ్యాణ్ రామ్ హీరోగా ఒక సినిమా తీయబోతున్నట్లు సమాచారం బయటికి వచ్చిన సంగతి తెలిసిందే. భారీ స్థాయిలో తెరకెక్కబోతున్న ఈ చిత్రానికి గంగరాజు స్క్రీన్ ప్లే సమకూరుస్తున్నారట. తన ప్రొడక్షన్లో వచ్చిన సినిమాల స్క్రీన్ ప్లేలో గంగరాజుకు కొంత భాగస్వామ్యం ఉంది. స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమాల్లో కూడా స్క్రీన్ ప్లే విషయంలో తన ప్రత్యేకతను చాటుకున్నారాయన. ఆయన తొలిసారిగా బయటి ప్రొడక్షన్లో తెరకెక్కబోయే సినిమాకు స్క్రీన్ ప్లే అందిస్తుండటం విశేషమే.