Begin typing your search above and press return to search.

తనుశ్రీ ఆరోపణల్లో నిజం లేదు

By:  Tupaki Desk   |   27 Sept 2018 10:01 AM IST
తనుశ్రీ ఆరోపణల్లో నిజం లేదు
X
బాలీవుడ్ హీరోయిన్ తనుశ్రీ దత్తా రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ 2008 లో ఒక సినిమా షూటింగ్ సమయంలో తను వేధింపులకు గురయ్యానని తెలిపింది. మొదట్లో పేరు వెల్లడించలేదు గానీ ఫైనల్ గా తనను లైంగిక వేధింపులకు గురిచేసినదెవరో కాదు.. సీనియర్ నటుడు నానా పటేకర్ అని చెప్పింది. నేషనల్ అవార్డు విన్నర్ అయిన నానాపై ఇలాంటి ఆరోపణలు రావడం ఇది మొదటి సారి కావడంతో ఆమె ఆరోపణలు సంచలనం సృష్టించాయి.

'హార్న్ ఒకే ప్లీజ్' చిత్రం కోసం ఒక సోలో సాంగ్ షూట్ జరుగున్నసమయంలో కొరియోగ్రాఫర్ ను పక్కనబెట్టి నానా తనతో సన్నిహితంగా నటించాలని వేధించాడట. కానీ నానా చెప్పినదానికి తను అంగీకరించలేదని.. అప్పుడు నానా రాజకీయ పార్టీలకు చెందిన వారిని కొందరిని పిలిచి గొడవ చేశాడని ఆరోపించింది. ఈ పాటకు గణేష్ ఆచార్య కొరియోగ్రాఫర్. హీరోయిన్ ఆరోపణలపై స్పందించిన అయన తనుశ్రీ ఆరోపణల్లో వాస్తవం లేదని అన్నాడు.

గణేష్ ఆ విషయంపై మాట్లాడుతూ "అది చాలా పాత విషయం. నాకు పెద్దగా గుర్తులేదు. నాకు గుర్తున్నంతవరకూ అది సోలో సాంగ్ కాదు.. డ్యూయెట్. అక్కడ ఎదో కారణం వల్ల షూటింగ్ నిలిచిపోయింది. అపార్థం చేసుకోవడం వల్లే అక్కడేదో జరిగింది. అంతకు మించి నానా ఆమెతో అసభ్యంగా ప్రవర్తించడం.. రాజకీయ పార్టీలకు చెంది న మనుషులను తీసుకొచ్చి గొడవపడడం జరగలేదు. అంతే కాదు.. ఆ పాట రిహార్సల్స్ సమయంలోనే నానా పటేకర్ ఆ పాటలో ఉన్నారని నిర్మాతలు నాకు చెప్పారు.అయినా ఆ పాటలో ఎలాంటి అసభ్యకరమైన సన్నివేశాలు లేవు. అదంతా డ్యాన్స్ తో ఉన్న పాటే. "

ఇక ఆ పాటనుండి తనుశ్రీ తప్పుకోవడంతోనే రాఖి సావంత్ తో పాటను చిత్రీకరించారు కదాఅని అడిగితే..అది నిర్మాతల నిర్ణయం అని చెప్పాడు. ఇక నానా గురించి మాట్లాడుతూ అయన చాలా మంచి వ్యక్తి అని చిత్ర పరిశ్రమలో ఎంతో మందికి సహాయం చేశాడని చెప్పాడు. తనుశ్రీ ఆరోపించినట్టు నానా ఎప్పుడూ ఎవరితో కూడా ప్రవర్తించలేదని క్లారిటీ ఇచ్చాడు.