Begin typing your search above and press return to search.

300 ఏళ్ల నాటి డ్రాగ‌న్ వార్ స్టోరీతో `గేమ్ ఆఫ్ థ్రోన్స్` ప్రీక్వెల్

By:  Tupaki Desk   |   8 Dec 2020 11:10 AM IST
300 ఏళ్ల నాటి డ్రాగ‌న్ వార్ స్టోరీతో `గేమ్ ఆఫ్ థ్రోన్స్` ప్రీక్వెల్
X
300ఏళ్ల నాటి డ్రాగ‌న్ వార్ స్టోరీతో వ‌ర‌ల్డ్ క్లాస్ వీఎఫ్‌.ఎక్స్ విజువ‌ల్స్ తో ఏదైనా వెబ్ సిరీస్ అందుబాటులో ఉంటే వీక్షించేందుకు ఎవ‌రికైనా అభ్యంత‌ర‌మా? హాలీవుడ్ రేంజు అనుభూతిని క‌లిగించేందుకు బుల్లితెర సిద్ధ‌మైతే కాద‌ని అన‌గ‌ల‌రా? ఇదిగో ఇది అలాంటి ట్రీట్ అనే చెప్పాలి.

గేమ్ ఆఫ్ థ్రోన్స్ సిరీస్ సంచ‌ల‌నాల గురించి చెప్పాల్సిన ప‌నే లేదు. ప్ర‌స్తుతం ఈ సిరీస్ కి ప్రీక్వెల్ గా `హౌస్ ఆఫ్ ది డ్రాగన్` రెడీ అవుతోంది.
గేమ్ ఆఫ్ థ్రోన్స్ సిరీస్ లో ఎనిమిదవ సీజ‌న్ పైగా ఆఖరి సీజన్ HBO లో ప్రసారం కానుంది. సీట్ ఎడ్జ్ లో కూచోబెట్టేంత ఉత్కంఠ‌తో ఈ సిరీస్ ని ముగించేందుకు భారీ బ‌డ్జెట్ల‌ను వెచ్చించార‌ని స‌మాచారం.

దాదాపు రెండు సంవత్సరాల తరువాత సిద్ధ‌మైన‌ ప్రీక్వెల్ గా `హౌస్ ఆఫ్ ది డ్రాగన్` ఎలాంటి సంచ‌ల‌నాలు న‌మోదు చేస్తుందోన‌న్న ఉత్కంఠ నెల‌కొంది. జార్జ్ ఆర్. ఆర్. మార్టిన్ మొట్టమొదటి టార్గారిన్ చరిత్ర పుస్తకం `ఫైర్ & బ్లడ్` 300 ఏళ్ల‌కు పూర్వం `ఎ గేమ్ ఆఫ్ థ్రోన్స్` ఆధారంగా ఈ సిరీస్ తెర‌కెక్కుతోంది. తాజా సీజ‌న్ లో కిట్ హారింగ్టన్ - ఎమిలియా క్లార్క్ కథకు 300 సంవత్సరాల ముందు నాటి క‌థతో ర‌న్ అవుతుంది. కొత్త సిరీస్ ‌లో డ్రాగన్లు ఉంటాయ‌ని ద‌ర్శ‌కుడు ఇంత‌కుముందే ధృవీకరించారు.

గురువారం సోష‌ల్ మీడియాల్లో రెడ్ డ్రాగన్ ఫోటోలను పోస్ట్ చేయ‌డంతో దీనిపై ఉత్కంఠ ప‌దింత‌లైంది. ఈ సీజ‌న్ లో బహుశా ప్రధాన పాత్ర డ్రాగ‌న్ దేన‌న్న ఊహాగానాలు మొద‌ల‌య్యాయి. “డ్రాగన్స్ వస్తున్నాయి. హౌస్ డ్రాగన్ 2021 లో ఉత్పత్తిని ప్రారంభిస్తుంది” అన్న ప్ర‌క‌ట‌న‌తో అభిమానుల్లో ఒకటే నిలువ‌నివ్వ‌ని ఉత్కంఠ క‌నిపిస్తోంది.

``గేమ్ ఆఫ్ థ్రోన్స్ విశ్వం కథలన్నిటిలో ఇది చాలా గొప్పది`` అని HBO ప్రోగ్రామింగ్ ప్రెసిడెంట్ కేసీ బ్లోయిస్ గత సంవత్సరం ఒక ప్రకటనలో తెలిపారు. హౌస్ టార్గారిన్ మూలాలు వెస్టెరోస్ మునుపటి రోజులతో పాటు మిగ్యుల్.. ర్యాన్ .. జార్జ్ లతో అన్వేషించడానికి మేము ఎదురుచూస్తున్నాము అని తెలిపారు. కాబట్టి HBO లో ప్రీక్వెల్ క‌థలో సంథింగ్ ఉంద‌న్న ఆస‌క్తి నెలకొంది.