Begin typing your search above and press return to search.

నిజం చెప్పాలంటే.. గేమ్ ఆఫ్ థ్రోన్స్ లా..

By:  Tupaki Desk   |   15 April 2017 6:10 AM GMT
నిజం చెప్పాలంటే.. గేమ్ ఆఫ్ థ్రోన్స్ లా..
X
ఇప్పుడు ''గేమ్ ఆఫ్ థ్రోన్స్'' అనే టివి సీరియల్ వారు.. ''బాహుబలి'' సినిమాను మెచ్చుకున్నారంటూ ఆల్రెడీ చెప్పుకున్నాం. అయితే ఒక టివి సీరియల్ వారు మెచ్చుకుంటే పెద్ద విషయం ఏముందిలే అని తెలియనివారు అనుకుంటే.. అసలు ఒక సీజన్ లో వచ్చే 10 ఎపిసోడ్ల బడ్జెట్ తో మన బాహుబలిని తీసేశాం కదా.. మన సినిమా అంత పెద్ద మేకర్లకు ఎలా నచ్చింది అను అనుకొనేవారు ఇంకొందరు.

నిజానికి గేమ్ ఆఫ్‌ థ్రోన్స్ అనేది టివి సీరియల్ అనే మాటకేగాని.. ఆద్యంతం సినిమాను తలపిస్తుంది. ఒక రాజ్యం కోసం ఎన్నో చిన్న రాజ్యాలు వారు కొట్టుకునే తీరు.. కుళ్ళూ కుతంత్రాలు.. యుద్దాలు.. న్యూడిటీ.. విజువల్ ఎఫెక్ట్స్.. ఇవన్నీ సీరియల్ లో పీక్స్ లో ఉంటాయి. అయితే బాహుబలి విజువల్స్ అన్నీ కూడా సేమ్ ఈ సీరియల్ తరహాలోనే తీయడం రాజమౌళికే చెల్లింది. కొన్ని సీన్లు వార్మ్ టోన్ లో తీయడం.. కొన్ని కూల్ టింట్ లో మంచు బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కించడం.. ఇలా రాజమౌళి ఆ సీరియల్ లో ప్రపంచం చూసిన కలర్ ప్యాలెట్ తన సినిమాలో కూడా దింపేశాడు. అలాగే ఇక్కడ కూడా కథ అండ్ కథనం ఆ సీరియల్ తరహాలోనే రకరకాల మలుపులు తిరుగుతూ సాగుతుంది. అందుకే ఆ సీరియల్ వారికి మన సినిమా అంతలా నచ్చింది.

నిజానికి బాహుబలి సినిమాలో కనుక రాజమౌళి మన తెలుగు అండ్ తమిళ యాక్టర్లతోపాటు బాలీవుడ్ వారిని కూడా క్యాస్టింగ్ చేసుంటే.. సినిమా రేంజ్ ఖచ్చితంగా మరో మెట్టు పైకి వెళ్ళేదేమో. కేవలం బాలీవుడ్ లో తెలియని ఫేసులతో ఇలాంటి మ్యాజిక్ చేస్తే.. ఇక తెలిసిన ఫేసులతో అయితే అదరగొట్టేశేవాడు జక్కన్న. అప్పుడు లార్డ్ ఆఫ్ ది రింగ్స్ సినిమాను తీసినోళ్ళు కూడా బాహుబలి గురించి చెప్పుకునేవారేమో.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/